PAK vs BAN : అరెరె.. ఈ సీనియ‌ర్ త్ర‌యానికి షాక్ ఇచ్చిన పాక్‌.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు డౌటేనా?

స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది.

PCB Big shock to Babar Azam Mohammad Rizwan and Shaheen Afridi

స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మందితో కూడిన జ‌ట్టును వెల్ల‌డించింది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు అయిన బాబ‌ర్ ఆజామ్‌, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, షాహీన్ అప్రిదిల‌కు జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)లో ప్ర‌ద‌ర్శన ఆధారంగానే జ‌ట్టును ఎంపిక చేసిన‌ట్లు సెల‌క్ట‌ర్లు తెలిపారు.

సల్మాన్‌ ఆఘా నేతృత్వంలో పాక్ బ‌రిలోకి దిగ‌నుంది. షాదాబ్‌ ఖాన్‌ను అతడికి డిప్యూటీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, నసీమ్ షా లు రీ ఎంట్రీ ఇవ్వ‌గా.. దక్షిణాఫ్రికా పర్యటనలో చీలమండ గాయానికి గురైన సైమ్ అయూబ్ కోలుకోవ‌డంతో అత‌డు జ‌ట్టులోకి వ‌చ్చాడు.

Mumbai Indians : పాయింట్ల పట్టిక‌లో అగ్ర‌స్థానంపై క‌న్నేసిన ముంబై.. ఇలా జ‌రిగితే గుజ‌రాత్, ఆర్‌సీబీ, పంజాబ్ ల‌కు క‌ష్ట‌మే..

తొలి టీ20 మ్యాచ్ మే 28న‌, రెండో టీ20 మ్యాచ్ మే 30న, మూడో టీ20 మ్యాచ్ జూన్ 1న జ‌ర‌గ‌నుంది. ఈ మూడు మ్యాచ్‌లు కూడా గడాఫీ వేదికగానే జ‌ర‌గ‌నున్నాయి. ఈ సిరీస్‌తోనే మైక్‌ హెసన్‌ పాకిస్తాన్‌ కొత్త కోచ్‌గా తన ప్రయాణం మొదలు పెట్టనున్నాడు.

ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ క‌ష్ట‌మేనా?

వ‌చ్చే ఏడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇందుకు స‌న్నాహ‌కాల్లో భాగంగానే పాక్ జ‌ట్టు బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ ఆట‌గాళ్లు బాబ‌ర్‌, రిజ్వాన్‌, షాహీన్‌ల‌ను ప‌క్కన పెట్ట‌డంతో.. టీ20ప్ర‌పంచ‌క‌ప్ 2026కి వారి పేర్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోం అనే సంకేతాల‌ను సెల‌క్ట‌ర్లు ఇచ్చిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది.

MI vs DC : ప్లేఆఫ్స్‌కు చేరుకోని ఢిల్లీ క్యాపిట‌ల్స్‌.. బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. 10 శాతం జ‌రిమానా..

బంగ్లాదేశ్‌తో టీ20సిరీస్‌కు పాకిస్తాన్‌ జట్టు ఇదే..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారీస్‌ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్ దిల్‌ షా, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మహ్మద్‌ వసీం జూనియర్‌, ముహ్మద్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌, నసీం షా, సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (వికెట్‌ కీపర్‌), సయీమ్‌ ఆయుబ్‌.