PCB : టెస్టు క్రికెట్ ఎంట్రీ టికెట్ రూ.15 మాత్ర‌మే.. పాక్ ఆట‌గాళ్ల‌కు ఆ మాత్రం కూడా ఎక్కువేనా..?

ప్ర‌స్తుత రోజుల్లో 15 రూపాయ‌లు పెడితే ఏం వ‌స్తుంది మ‌హా అయితే ఓ టీ వ‌స్తుందేమో గానీ ఓ అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను చూడొచ్చున‌ని తెలుసా..?

PCB prices Pakistan vs Bangladesh Test tickets at only INR 15

Pakistan Cricket Board : మ‌న‌దేశంలో క్రికెట్ మ్యాచుల‌కు ఉండే క్రేజే వేరు. అది ఐపీఎల్ అయినా, అంత‌ర్జాతీయ మ్యాచులు అయినా స‌రే టికెట్ ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతాయి. ఆఖ‌రికి ప‌సికూన జ‌ట్ల‌తో టీమ్ఇండియా త‌ల‌ప‌డినా కూడా మ్యాచ్ టికెట్ల‌ను కొన‌డం సాధ్యం కాదు. అంత‌లా ఉంటాయి ధ‌ర‌లు. వ‌న్డేలు, టీ20 మ్యాచ్ టికెట్ల‌తో పోలిస్తే టెస్టుల‌కు సంబంధించిన టికెట్ల ధ‌ర‌లు కాస్త త‌క్కువ‌గానే ఉంటాయన్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుత రోజుల్లో 15 రూపాయ‌లు పెడితే ఏం వ‌స్తుంది మ‌హా అయితే ఓ టీ వ‌స్తుందేమో గానీ ఓ అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను చూడొచ్చున‌ని తెలుసా..? ఏంటీ మాతో జోక్ చేస్తున్నారా..? అని అంటారా..? జోక్ ఏమీ కాదండి బాబు ఇది నిజంగా నిజం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న టెస్టు మ్యాచుల‌కు సంబంధించిన టికెట్ ధ‌ర‌ల‌ను తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫిక్స్ చేసింది.

Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో ర‌జ‌తం.. భార‌త్‌కు రానీ నీర‌జ్.. జ‌ర్మ‌నీకి ప‌య‌నం.. ఎందుకంటే..?

ఇటీవ‌ల కాలంలో పాకిస్తాన్ జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌తో పాటు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ దారుణంగా నిరాశ‌ప‌రిచింది. దీంతో ఆ జ‌ట్టు ఆడే మ్యాచుల‌ను చూసేందుకు ఎక్కువ సంఖ్య‌లో ప్రేక్ష‌కుల ఆస‌క్తి చూప‌డం లేదు. అంతెందుకు ఐపీఎల్ కు పోటీగా పీసీబీ నిర్వ‌హిస్తున్న పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ ను ఈ ఏడాది ఖాళీ స్టేడియాల్లో నిర్వ‌హించారు. ఈ మ్యాచ్‌ల‌ను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు.

ఈ క్ర‌మంలో పీసీబీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆగ‌స్టు 21 నుంచి బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న రెండు టెస్టు మ్యాచుల సిరీస్ సంబంధించిన టికెట్ ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గింది. రావ‌ల్పిండి వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టెస్టును క‌నీస టికెట్ ధ‌ర‌ను పాకిస్తాన్ క‌రెన్సీలో రూ. 200 గా (భార‌త క‌రెన్సీలో రూ.60) నిర్ణ‌యించారు. ఇక క‌రాచీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో టెస్టు ఎంట్రీ టికెట్ ధ‌ర‌ను రూ.50 (భార‌త క‌రెన్సీలో రూ.15)గా నిర్ణ‌యించారు.

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ప‌త‌క వీరుల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రికి ఎంతంటే..?

కాగా దశాబ్ద కాలంలో కరాచీ స్టేడియంలో ఇంత తక్కువ ధరకు టిక్కెట్లను విక్రయించడం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సిరీస్‌కు సంబంధించిన టికెట్లు ఆగస్టు 13 నుంచి అభిమానుల‌కు అందుబాటులోకి రానున్నాయి. మొద‌టి టెస్టు గరిష్ట టికెట్‌ ధరగా 60,000 కాగా.. రెండో టెస్టు అత్యధిక టిక్కెట్ ధర 83,000గా నిర్ణ‌యించారు. ఈ గ‌రిష్ట ధ‌ర టికెట్లు కొనుగొలు చేసిన వారికి పీసీబీ అన్ని రకాల సదుపాయాలు క‌ల్పించ‌నుంది.

ధ‌ర‌లు ఇంత త‌గ్గించిన‌ప్ప‌టికి మ్యాచులు చూసేందుకు అభిమానులు వ‌స్తారో, రాలోన‌ని పీసీబీ ఆందోళ‌న చెందుతోంది. చూడాలి మ‌రి పీసీబీ తీసుకున్న ఈ నిర్ణ‌యంతోనైనా స్టేడియాలు నిండుతాయో లేదో మ‌రి.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. భార‌త్‌కు ఒక గుడ్‌న్యూస్‌.. మ‌రో బ్యాడ్ న్యూస్‌..!

ట్రెండింగ్ వార్తలు