Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ప‌త‌క వీరుల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రికి ఎంతంటే..?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడాభిమానుల‌కు ఎన్నో మ‌ధురానుభూతుల‌ను మిగిల్చిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది.

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ప‌త‌క వీరుల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రికి ఎంతంటే..?

How much cash prize did Indias Paris Olympics medal winners receive

Paris Olympics 2024 : ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడాభిమానుల‌కు ఎన్నో మ‌ధురానుభూతుల‌ను మిగిల్చిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది. భార‌త దేశం మొత్తం 6 ప‌త‌కాల‌ను సొంతం చేసుకుంది. ఇందులో ఒక‌టి ర‌త‌జం కాగా.. మిగిలిన ఐదు కూడా కాంస్య ప‌త‌కాలు. టోక్యో ఒలింపిక్స్‌తో పోల్చుకుంటే ఓ ప‌త‌కం త‌క్కువ‌గానే వ‌చ్చిన‌ప్ప‌టికి మ‌న అథ్లెట్‌లు చాలా మంచి ప్ర‌ద‌ర్శ‌న‌నే ఇచ్చారు. కొన్ని విభాగాల్లో తృటిలో ప‌త‌కాల‌ను చేజార్చుకున్నారు. మ‌రి మ‌న ప‌త‌క వీరుల‌కు ప్ర‌భుత్వాలు ఏ విధంగా గౌర‌వించింది. వారికి ఎంత మ‌నీ ప్రైజ్‌మ‌నీగా ల‌భించింది అన్న విష‌యాల‌ను ఓ సారి చూద్దాం..

మను భాకర్ (షూటింగ్)
భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు ప‌త‌కాలు తెచ్చిన మొద‌టి అథ్లెట్‌గా బాక్స‌ర్ మ‌ను భాక‌ర్ చ‌రిత్ర సృష్టించింది. 10 మీట‌ర్ల వ్య‌క్తిగ‌త పిస్ట‌ల్ విభాగంతో పాటు మిక్స్‌డ్ డ‌బుల్స్ ఈవెంట్‌లో స‌ర‌బ్‌జ్యోత్ సింగ్‌తో క‌లిసి కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా ఆమెకు రూ.30 లక్షల నగదు బహుమతిని ప్ర‌క‌టించారు. పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు కార్యక్రమంలో 22 ఏళ్ల మ‌ను భార‌త్ త‌రుపున ప‌త‌క‌ధారిగా వ్య‌వ‌హ‌రించ‌నుంది.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. భార‌త్‌కు ఒక గుడ్‌న్యూస్‌.. మ‌రో బ్యాడ్ న్యూస్‌..!

సరబ్జోత్ సింగ్ (షూటింగ్)
మను భాకర్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అంబాలాకు చెందిన 22 ఏళ్ల యువకుడికి కేంద్ర క్రీడ‌ల శాఖ మంత్రి రూ.22.5 ల‌క్ష‌ల రివార్డును ప్ర‌క‌టించారు. అత‌డి స్వ‌రాష్ట్రం హ‌ర్యానా ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని ఆఫ‌ర్ చేసింది. అయితే.. త‌న దృష్టిం అంతా కూడా షూటింగ్ పైనే ఉంద‌ని, సున్నింతంగా ఆ జాబ్ ఆఫ‌ర్ ను అత‌డు తిర‌స్క‌రించాడు.

స్వప్నిల్ కుసలే (షూటింగ్)
పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన తొలి భారతీయ షూటర్‌గా స్వప్నిల్ కుసాలే నిలిచాడు. సెంట్ర‌ల్ రైల్వేలో ప్ర‌త్యేక అధికారిగా నియ‌మితుల‌య్యాడు. అంతేకాకుండా మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కోటి రూపాయల న‌గ‌దు బ‌హుమ‌తిని ప్ర‌క‌టించాడు.

భారత పురుషుల హాకీ జట్టు
భారత పురుషుల హాకీ జట్టు 2-1తో స్పెయిన్‌ను ఓడించి ఒలింపిక్స్‌లో వరుసగా రెండో కాంస్య పతకాన్ని సాధించింది. హాకీ ఇండియా జట్టులోని ఒక్కో సభ్యునికి రూ.15 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.7.5 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. డిఫెండర్ అమిత్ రోహిదాస్‌కు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ రూ.4 కోట్ల బహుమతి ప్రకటించారు. అలాగే ప్రతి క్రీడాకారుడికి రూ.15 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.10 లక్షలు బహుమతిగా ప్రకటించారు.పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్రానికి చెందిన హాకీ జ‌ట్టులోని విజేత‌ల‌కు కోటి రూపాయల బహుమతిని ప్రకటించారు.’

Sachin Tendulkar : అంజ‌లితో ప్రేమ‌.. తొలిసారి అత్త‌గారిని క‌లిసిన‌ప్పుడు స‌చిన్ ఏమ‌న్నాడంటే..? ఆ విష‌యంలో భ‌య‌ప‌డిన అంజ‌లి మ‌ద‌ర్‌..

నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో)
జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రా రజతం సాధించాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల త్రోతో ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి బంగారు పతకాన్ని సాధించాడు. నీరజ్ నగదు బహుమతుల గురించి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. అతను వివిధ సంస్థ‌ల నుంచి అవార్డులు, రివార్డులు అందుకోనున్న‌ట్లు తెలుస్తోంది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించినప్పుడు అతనికి హర్యానా ప్రభుత్వం రూ. 6 కోట్ల నగదు బహుమతిని అందజేసింది.

అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్)
57 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించి పతకం సాధించిన ఏకైక భారతీయ రెజ్లర్ అమన్ సెహ్రావత్. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారత క్రీడాకారుడిగా రికార్డుల‌కు ఎక్కాడు. కాగా.. ఇత‌డు అందుకోనున్న న‌గ‌దు బ‌హుమ‌తుల గురించి అధికారిక ప్ర‌క‌ట‌న ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు.

Viral Video : ఇలా ఉన్నారేంట్రా బాబు.. ప్ర‌పంచ‌క‌ప్ గెలిచినా గుర్తు ప‌ట్ట‌ని వైనం.. ఇది నిజంగా స్టార్ క్రికెట‌ర్ల‌కు అవ‌మాన‌మే..!