Ashes Series : యాషెస్ సిరీస్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. 1986 త‌రువాత ఇలా తొలిసారి

క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న యాషెస్ సిరీస్ షెడ్యూల్ వ‌చ్చేసింది.

Ashes Series : యాషెస్ సిరీస్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. 1986 త‌రువాత ఇలా తొలిసారి

Perth To Host Opening Test Of Ashes Series 2025

Updated On : October 16, 2024 / 1:24 PM IST

Ashes Series : క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న యాషెస్ సిరీస్ షెడ్యూల్ వ‌చ్చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధ‌వారం యాషెస్ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. 5 టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జ‌ట్లు 2025 నవంబ‌ర్ 21 పెర్త్ వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక రెండో టెస్ట్‌ను డే అండ్ నైట్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ పింక్ బాల్ టెస్టుకు బ్రిస్బేన్‌లోని గ‌బ్బా వేదిక కానుంది.

ఇక మూడో టెస్టుకు అడిలైడ్‌ ఓవల్‌ మైదానం, బాక్సింగ్‌ డే మ్యాచ్‌కు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ), ఐదో టెస్టుకు సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికలుగా ఉన్నాయి.

PAK vs ENG : శ‌త‌కంతో చెల‌రేగిన క‌మ్రాన్ గులామ్‌.. బాబ‌ర్ ఆజం ఏమ‌న్నాడంటే..?

ఇదిలా ఉంటే.. యాషెస్‌ సిరీస్‌లో మొద‌టి టెస్టుకు పెర్త్‌ ఆతిథ్యం ఇవ్వనుండటం గ‌త 43 ఏళ్లలో ఇదే మొద‌టి సారి. 1986 నుంచి యాషెస్ సిరీస్ తొలి టెస్టుకు బ్రిస్బేన్ ఆతిథ్యం ఇస్తూ వ‌స్తోంది. అయితే.. ఈ సారి పెర్త్ ఆతిథ్యం ఇస్తోంది.

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన గత యాషెస్‌ సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. మూడో టెస్టు డ్రాగా ముగియ‌గా.. నాలుగు, ఐదో టెస్టుల్లో ఇంగ్లాండ్ గెలుపొందింది.

SL vs WI : 5, 7, 4, 0, 14, 4, 20, 1, 7, 16, 5.. వెస్టిండీస్ ఫోన్ నంబ‌ర్ ఇదా!

యాషెస్‌ సిరీస్ ( 2025- 26) షెడ్యూల్‌..

* తొలి టెస్టు – 2025 నవంబరు 21 నుంచి 25 వ‌ర‌కు – పెర్త్‌ స్టేడియం
* రెండో టెస్టు – 2025 డిసెంబరు 4 నుంచి 8 వ‌ర‌కు – బ్రిస్బేన్‌లోని గ‌బ్బా స్టేడియం
* మూడో టెస్టు – 2025 డిసెంబరు 17 నుంచి 21 వ‌ర‌కు – అడిలైడ్‌ ఓవల్‌
* నాలుగో టెస్టు – 2025 డిసెంబరు 26 నుంచి 30 వ‌ర‌కు – ఎంసీజీ
* ఐదో టెస్టు – 2026 జనవరి 4 నుంచి 8 వ‌ర‌కు – ఎస్‌సీజీ