Piyush Chawla Retirement From All Forms Of Cricket at 36
భారతదేశం తరపున రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన లెగ్ స్పిన్నర్, ఐపీఎల్ లెజెండ్ పియూష్ చావ్లా క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పాటు దేశవాలీ క్రికెట్ కు కూడా ఈ నిర్ణయం తక్షణమే వర్తిస్తుందని 36 ఏళ్ల ఈ ఆటగాడు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో గడిపిన తరువాత ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని తెలిపాడు. తన కెరీర్‌లో తనకు మద్దతు ఇచ్చిన కోచ్‌లు, కుటుంబ సభ్యులు, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను పంచుకున్నాడు.
Rishabh Pant : అయ్యో పంత్.. రోహిత్ శర్మ ఆ పని చేస్తున్నాడా ? ఇది గనుక హిట్‌మ్యాన్ వింటే నీ పని…
భారతదేశం తరపున రెండు ప్రపంచకప్ (2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్ ) గెలిచిన జట్లలో చావ్లా సభ్యుడిగా ఉన్నాడు. టీమ్ఇండియా తరుపున 3 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 43 వికెట్లు తీశాడు. టీమ్ఇండియా తరుపున పెద్దగా రాణించకున్నా ఐపీఎల్‌లో మాత్రం గొప్ప స్పిన్నర్లలో ఒకడిగా పేరుగాంచాడు.
ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న చావ్లా ఇప్పటి వరకు 192 మ్యాచ్‌లు ఆడి 192 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. చహల్ (221), భువనేశ్వర్ కుమార్ (198) లు మాత్రమే అతడి కన్నా ముందు ఉన్నారు. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు చావ్లా ప్రాతినిథ్యం వహించాడు.
Gautam Gambhir-Karun Nair : కౌంటీలు ఆడడంతోనే కరుణ్ నాయర్‌ను తీసుకున్నారా? గంభీర్ అసలు ఏమన్నాడు ?
చివరిగా 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 2025 మెగావేలంలో అతడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దేశవాలీ క్రికెట్‌లో 137 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 446 వికెట్లు పడగొట్టాడు