PM Modi Praise: మాస్కోలో గోల్డ్ మెడల్ సాధించిన 15 ఏళ్ల సాదియా తారిఖ్ ను ప్రశంసించిన మోదీ

రష్యాలోని మాస్కోలో జరుగుతున్న "వూషూ స్టార్స్ ఛాంపియన్‌షిప్" పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన 15 ఏళ్ల సాదియా తారిఖ్ ను ప్రధాని మోదీ సహా ఇతర నేతలు ప్రశంసల్లో ముంచెత్తారు.

Sadia Tariq

PM Modi Praise: రష్యాలోని మాస్కోలో జరుగుతున్న “వూషూ స్టార్స్ ఛాంపియన్‌షిప్” పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన 15 ఏళ్ల సాదియా తారిఖ్ ను ప్రధాని మోదీ సహా ఇతర నేతలు ప్రశంసల్లో ముంచెత్తారు. ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ ఆటల పోటీలు 28 వరకు జరుగుతున్నాయి. ఈక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క వార్షిక క్యాలెండర్ శిక్షణ మరియు పోటీలో భాగంగా శనివారం జరిగిన పోటీలో 15 ఏళ్ల సాదియా తన రష్యన్ ప్రత్యర్థిని ఓడించి అగ్రస్థానాన్ని గెలుచుకుంది. భారత్ లోని వివిధ రాష్ట్రాలకు చెందిన 23 మంది జూనియర్, 15 మంది సీనియర్ ఆటగాళ్లలో సాదియా తారిఖ్ ఒక్కరే జమ్మూకాశ్మీర్ నుంచి ఈ పోటీల్లో పాల్గొని విజయం సాధించింది.

Also read: PM Modi to Students: భారత్ లోనే మెడిసిన్ చదవొచ్చుగా: ప్రధాని మోదీ

సాదియా విజయంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. “మాస్కో వుషు స్టార్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నందుకు సాదియా తారిక్‌కు అభినందనలు. ఆమె విజయం ఎందరో వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు చేకూరాలని కోరుతున్నా” అంటూ ట్వీట్ చేశారు. జాతీయ క్రీడాశాఖ మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా సాదియాను అభినందించారు. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న సాదియా తారిఖ్.. జాతీయ స్థాయి వూషూ ఛాంపియన్‌షిప్ లో ఇప్పటివరకు రెండు బంగారు పథకాలు సాధించింది.


Also read: IND vs SL T20I : రెండో టీ20లో చెలరేగిన నిశాంక.. టీమిండియా టార్గెట్ 184