Ind vs Aus Final: భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
కీలక మ్యాచులో భారత బ్యాటర్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియా ముందు ఓ మోస్తరు లక్ష్యం నిలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌలైంది

ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కోసం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన నరేంద్రమోదీ స్టేడియం చేరుకుని.. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ ను తిలకించనున్నారు.
#WATCH | PM Narendra Modi arrived at Ahmedabad Airport; Gujarat.
(Visuals from earlier today) #ICCCricketWorldCup #IndiaVsAustralia pic.twitter.com/aiqkwKcfqj
— ANI (@ANI) November 19, 2023
కీలక మ్యాచులో భారత బ్యాటర్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియా ముందు ఓ మోస్తరు లక్ష్యం నిలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌలైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (54; 63 బంతుల్లో 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (66; 107 బంతుల్లో 1 ఫోర్) లు హాఫ్ సెంచరీలు చేశారు. రోహిత్ శర్మ (47; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. మిగిలిన వారు విఫలం కావడంతో ఓ మోస్తరు స్కోరుకే భారత్ పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు. మాక్స్‌వెల్, జంపాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.