×
Ad

Ruturaj Gaikwad : డ‌బుల్ సెంచ‌రీ చేసిన పృథ్వీ షాకు నో అవార్డు.. రుతురాజ్ గైక్వాడ్ ఏం చేశాడంటే..?

రంజీట్రోఫీలో పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్‌(Ruturaj Gaikwad)లు అద‌ర‌గొడుతున్నారు.

Prithvi Shaw Not Given Player Of The Match Award Then Ruturaj Gaikwad Star Does This

Ruturaj Gaikwad : రంజీట్రోఫీలో పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్‌లు అద‌ర‌గొడుతున్నారు. మ‌హారాష్ట్ర‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వీరు చండీగ‌ఢ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడారు. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ శ‌త‌కంతో (116) చెల‌రేగగా.. రెండో ఇన్నింగ్స్‌లో పృథ్వీ ఏకంగా డ‌బుల్ సెంచ‌రీ (222) బాదేశాడు.

ఈ మ్యాచ్‌లో మ‌హారాష్ట్ర గెలుపొందింది. కాగా.. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా డ‌బుల్ సెంచ‌రీ చేసిన‌ప్ప‌టికి కూడా తొలి ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేసిన రుతురాజ్ గైక్వాడ్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక అయ్యాడు. ఇక్క‌డే గైక్వాడ్ త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు. త‌న‌కు వ‌చ్చిన ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అత‌డు పృథ్వీ షాతో పంచుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు.

Jos Buttler : ఇయాన్ బెల్‌ను అధిగ‌మించి.. ఎలైట్ జాబితాలో చోటు సంపాదించుకున్న జోస్ బ‌ట్ల‌ర్‌..

వేదిక‌పైకి పృథ్వీషాను కూడా పిలిచి అవార్డును స్వీక‌రించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ షేర్ చేసింది. ఇది అస‌లైన నాయ‌క‌త్వం అంటూ రుతురాజ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా.. నెటిజ‌న్లు రుతురాజ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.