Jos Buttler : ఇయాన్ బెల్‌ను అధిగమించి.. ఎలైట్ జాబితాలో చోటు సంపాదించుకున్న జోస్ బట్లర్..
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler) అరుదైన ఘనత సాధించాడు.
NZ vs ENG 2nd ODI Jos Buttler surpasses Ian Bell on iconic list
Jos Buttler : ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇంగ్లాండ్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో 9 పరుగులు చేసిన అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాడు ఇయాన్ బెల్‌ను అధిగమించాడు.
ఇయాన్ బెల్ 161 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 157 ఇన్నింగ్స్‌ల్లో 37.87 సగటుతో 5416 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో కలిపి జోస్ బట్లర్ 195 మ్యాచ్‌లు ఆడాడు. 168 ఇన్నింగ్స్‌ల్లో 39.02 సగటుతో 5425 పరుగులు చేశాడు.
ఇక ఇంగ్లాండ్ తరుపున వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు జో రూట్ పేరిట ఉంది. రూట్ 185 మ్యాచ్‌ల్లో 48.85 సగటుతో 7328 పరుగులు చేశాడు. రెండో స్థానంలో ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. అతడు 225 మ్యాచ్‌ల్లో 39.75 సగటుతో 6957 పరుగులు సాధించాడు.
వన్డేల్లో ఇంగ్లాండ్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే..
* జో రూట్ – 185 మ్యాచ్‌ల్లో 7328 పరుగులు
* ఇయాన్ మోర్గాన్ – 225 మ్యాచ్‌ల్లో 6957 పరుగులు
* జోస్ బట్లర్ – 195 మ్యాచ్‌ల్లో 5425 పరుగులు
* ఇయాన్ బెల్ – 161 మ్యాచ్‌ల్లో 5416 పరుగులు
* పాల్ కాలింగ్‌వుడ్ – 197 మ్యాచ్‌ల్లో 5092 పరుగులు
* అలెక్ స్టీవర్ట్ – 170 మ్యాచ్‌ల్లో 4677 పరుగులు
* కెవిన్ పీటర్సన్ – 134 మ్యాచ్‌ల్లో 4422 పరుగులు
* మార్కస్ ట్రెస్కోథిక్ – 123 మ్యాచ్‌ల్లో 4335 పరుగులు
* గ్రాహం గూచ్ – 125 మ్యాచ్‌ల్లో 4290 పరుగులు
* జేసన్ రాయ్ – 116 మ్యాచ్‌ల్లో 4271 పరుగులు
