Mohammad Rizwan : ‘మీ కాంట్రాక్ట్ నాకొద్దు.. నా కండిషన్స్ ఇవే.. అప్పుడే సంతకం చేస్తా..’ పీసీబీకి షాకిచ్చిన రిజ్వాన్
పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
Mohammad Rizwan Refuses To Sign Central Contract
Mohammad Rizwan : పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పీసీబీ ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను అతడు తిరస్కరించినట్లు సమాచారం. 2025-26 సీజన్‌కు సంబంధించి 30 మంది ఆటగాళ్లతో పీసీబీ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను ప్రకటించగా అందులో రిజ్వాన్ ఒక్కడే సంతకం చేయలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వన్డే కెప్టెన్‌గా తనను తప్పించడం, టీ20 జట్టుకు ఎంపిక చేయకపోవడం పట్ల రిజ్వాన్ (Mohammad Rizwan ) అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు పీసీబీ ముందు కొన్ని కండీషన్స్ పెట్టినట్లు పాక్ కు చెందిన ‘జియో సూపర్ తమ కథనంలో తెలిపింది.
మొదటిది.. సీనియర్లు, అత్యుత్తమ ఆటతీరు కనబరిచే ఆటగాళ్లను కేటగిరీ ‘ఏ’ లో చేర్చాలని, దాన్ని వెంటనే పునరుద్దరించాలని. ఇక రెండోది కొత్తగా నియమించబడిన ఏ కెప్టెన్‌కైనా స్పష్టమైన పదవీకాలం, బోర్డు జోక్యం లేకుండా వారి ప్రణాళికలను అమలు చేయడానికి పూర్తి అధికారం ఇవ్వబడుతుందని హామీ ఇవ్వడం. అనేవి రిజ్వాన్ కండిషన్స్ అని పేర్కొంది.
గతంలో మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్ వంటి ఆటగాళ్లు ఏ కేటగిరి జాబితాలో ఉండేవారు. అయితే.. ఈ సారి ఏ కేటగిరిని పీసీబీ పూర్తిగా తొలగించింది. రిజ్వాన్, బాబర్ ఆజామ్‌లను బీ కేటగిరిలో చేర్చింది. మరి రిజ్వాన్ కండిషన్స్‌కు పీసీబీ ఓకే చెబుతుందా? లేదో చూడాల్సిందే.
పాక్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా ఇదే..
కేటగిరీ బి
బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, అబ్రార్ అహ్మద్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, షాదాబ్ ఖాన్ మరియు షాహీన్ షా ఆఫ్రిది.
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. మ్యాచ్‌లను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చొ తెలుసా?
కేటగిరీ సి
అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమాన్ అలీ, సాహిబ్జాదా ఫర్హాన్, సాజిద్ ఖాన్ మరియు సౌద్ షకీల్.
కేటగిరీ డి
అహ్మద్ డానియల్, హుస్సేన్ తలత్, ఖుర్రం షాజాద్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అబ్బాస్ ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా, షాన్ మసూద్ మరియు సూఫియాన్ మొకీమ్.
