Babar Azam : ఇది కదా బాబర్ ఆజామ్ అంటే.. టీ20 రీఎంట్రీలో 2 బంతుల్లోనే.. సోషల్ మీడియాలో రచ్చరచ్చ..
చాలా కాలం తరువాత టీ20లో రీఎంట్రీ ఇచ్చిన బాబర్ ఆజామ్ (Babar Azam) డకౌట్ అయ్యాడు.
Babar Azam T20I return turns nightmare duck out in 1st T20 against South Africa
Babar Azam : దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన ఆసియాకప్ 2025 జట్టులో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్‌కు స్థానం దక్కలేదు. దీంతో అతడు ఇక టీ20లకు దూరం అయినట్లే అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు చోటు దక్కించుకున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. రీఎంట్రీలో సత్తా చాటి 2026 టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంటాడని ఆశించారు.
మంగళవారం రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ (60; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ బాదాడు. జార్జ్ లిండే (36), టోనీ డి జోర్జీ (33)లు రాణించారు. పాక్ బౌలర్లలోమహ్మద్ నవాజ్ మూడు వికెట్లు తీశాడు. సైమ్ అయూబ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Farzi King , Ling Babar Azam goes for a 🦆 #BabarAzam𓃵 #PAKvSA pic.twitter.com/38ABBjjqHP
— Neelotpal Srivastav (@NS_Neelotpal) October 28, 2025
ఆ తరువాత పాకిస్తాన్ 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (24) ఔట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో బాబర్ ఆజామ్ (Babar Azam) వచ్చాడు. భారీ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంటాడని ఫ్యాన్స్ ఆశించారు. అయితే.. రెండో బంతికే డకౌట్ అయ్యాడు. కార్బిన్ బాష్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి రీజా హెండ్రిక్స్ క్యాచ్ అందుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
దీంతో బాబర్ ఆజామ్ పై మరోసారి విమర్శల దాడి మొదలైంది. సోషల్ మీడియాలో బాబర్‌పై మీమ్స్ ఊపందుకున్నాయి. బాబర్ బ్యాటింగ్ మరిచిపోయాడని కామెంట్లు చేస్తున్నారు.
INDW vs AUSW : భారత్, ఆసీస్ సెమీస్‌కు వర్షం ముప్పు..? మ్యాచ్ రద్దైతే ఏ జట్టుకు ప్రయోజనం అంటే?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బాబర్‌తో పాటు మిగిలిన ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో పాక్ లక్ష్య ఛేదనలో 18.1 ఓవర్లలో 139 పరుగులకు కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా 55 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుని పోయింది.
