Suryakumar Yadav : ఆసీస్‌తో టీ20 సిరీస్‌.. కోహ్లీ, రోహిత్ ల రికార్డుల‌పై సూర్య‌కుమార్ యాద‌వ్ క‌న్ను..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల రికార్డుల‌పై సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) క‌న్నేశాడు.

Suryakumar Yadav : ఆసీస్‌తో టీ20 సిరీస్‌.. కోహ్లీ, రోహిత్ ల రికార్డుల‌పై సూర్య‌కుమార్ యాద‌వ్ క‌న్ను..

IND vs AUS T20 Series Suryakumar Yadav eye on Virat Kohli and Rohit Sharma records

Updated On : October 28, 2025 / 7:44 PM IST

Suryakumar Yadav : భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య బుధ‌వారం (అక్టోబ‌ర్ 29న‌) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ప‌లు రికార్డులు ఊరిస్తున్నాయి.

సూర్య‌కుమార్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఆరు టీ20 ఇన్నింగ్స్‌ల్లో 26 ఫోర్లు, 9 సిక్స‌ర్ల సాయంతో 239 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ఆసీస్ గ‌డ్డ‌పై టీ20ల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన విదేశీ ఆట‌గాడిగా నిలిచేందుకు సూర్య‌కు మ‌రో 12 సిక్స‌ర్లు అవ‌స‌రం. ప్ర‌స్తుతం ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 16 ఇన్నింగ్స్‌ల్లో 20 సిక్స‌ర్లు బాదాడు.

INDW vs AUSW : భార‌త్‌, ఆసీస్ సెమీస్‌కు వ‌ర్షం ముప్పు..? మ్యాచ్ ర‌ద్దైతే ఏ జ‌ట్టుకు ప్ర‌యోజ‌నం అంటే?

ఆసీస్ గ‌డ్డ పై టీ20ల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన విదేశీల ఆట‌గాళ్లు వీరే..

* విరాట్ కోహ్లీ – 16 ఇన్నింగ్స్‌ల్లో 20 సిక్స‌ర్లు
* డెవాల్డ్ బ్రెవిస్ – 3 ఇన్నింగ్స్‌ల్లో 14 సిక్స‌ర్లు
* కుశాల్ మెండిస్ – 16 ఇన్నింగ్స్‌ల్లో 14 సిక్స‌ర్లు
* జోస్ బ‌ట్ల‌ర్ – 14 ఇన్నింగ్స్‌ల్లో 13 సిక్స‌ర్లు
* అలెక్స్ హేల్స్‌- 14 ఇన్నింగ్స్‌ల్లో 13 సిక్స‌ర్లు

రోహిత్ రికార్డు బ్రేక్ చేసేనా?

ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ20 మ్యాచ్‌ల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ఆట‌గాడి రికార్డు రోహిత్ శ‌ర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 20 ఇన్నింగ్స్‌ల్లో 29 సిక్స‌ర్లు బాదాడు. ఇక ఈ జాబితాలో సూర్య‌కుమార్ యాద‌వ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 19 సిక్స‌ర్లు కొట్టాడు. కోహ్లీ, యువీలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

IND vs AUS : భార‌త్‌, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌.. మ్యాచ్‌ల‌ను ఎక్క‌డ ఫ్రీగా చూడొచ్చొ తెలుసా?

టీ20ల్లో ఆస్ట్రేలియాపై అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌తీయులు..

* రోహిత్ శ‌ర్మ – 20 ఇన్నింగ్స్‌ల్లో 29 సిక్స‌ర్లు
* విరాట్ కోహ్లీ – 22 ఇన్నింగ్స్‌ల్లో 26 సిక్స‌ర్లు
* యువ‌రాజ్ సింగ్ – 8 ఇన్నింగ్స్‌ల్లో 19 సిక్స‌ర్లు
* సూర్య‌కుమార్ యాద‌వ్ – 9 ఇన్నింగ్స్‌ల్లో 19 సిక్స‌ర్లు
* హార్దిక్ పాండ్యా – 10 ఇన్నింగ్స్‌ల్లో 14 సిక్స‌ర్లు