IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. మ్యాచ్‌లను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చొ తెలుసా?
బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
Do you know where to watch ind vs aus t20 series free
IND vs AUS : ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి టీ20 సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య బుధవారం (అక్టోబర్ 29) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు కాన్‌బెర్రా ఆతిథ్యం ఇవ్వనుంది.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుండగా, మిచెల్ మార్ష్ నాయకత్వంలో ఆస్ట్రేలియా ఆడనుంది. ఇటీవలే ఆసియాకప్ 2025 విజేతగా నిలిచిన భారత్ మంచి జోష్‌లో ఉంది. వన్డే సిరీస్‌లోలాగానే టీ20 సిరీస్‌లోనూ భారత్‌ను మట్టికరిపించాలని ఆసీస్ ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మ్యాచ్‌లను ఫ్రీగా ఎలా చూడొచ్చంటే..?
ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రసార హక్కులను స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్స్ కలిగి ఉంది. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్‌లో వీక్షించవచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే జియో హాట్ స్టార్‌లో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే.. ఈ రెండింటి కోసం వినియోగదారులు సబ్‌స్ర్కిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక జియో మొబైల్ వినియోగదారులు మాత్రం ప్రత్యేక రిచార్జ్‌లు చేసుకుంటే జియో హాట్ స్టార్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
ఇదిలా ఉంటే.. విదేశాల్లో జరిగే మ్యాచ్‌లు దూరదర్శన్ లో (డీడీ స్టోర్ట్స్)లో ఉచితంగా వీక్షించవచ్చు అన్న సంగతి తెలిసిందే. కానీ.. కేబుల్, డీటీహెచ్ సర్వీసుల్లో మాత్రం దూరదర్శన్ ఫ్రీగా రాదు. భూ ఆధారిత నెట్‌వర్క్ కనెక్షన్లలో మాత్రమే డీడీ స్పోర్ట్స్ ఫ్రీగా వస్తుంది అన్న సంగతి తెలిసిందే.
