Tilak Varma : ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. కెరీర్ మైల్ స్టోన్ పై తిలక్ వర్మ కన్ను.. రోహిత్‌ను అధిగమించి, సూర్యను సమం చేసే ఛాన్స్..
ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ(Tilak Varma)ను అరుదైన ఘనత ఊరిస్తోంది.
IND vs AUS 1st T20 Tilak Varma equal Suryakumar Yadav with major milestone in T20Is
Tilak Varma : భారత్, ఆసీస్ జట్ల మధ్య కాన్‌బెర్రా వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మను ఓ అరుదైన మెలురాయి ఊరిస్తోంది. ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో తిలక్ 38 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న టీమ్ఇండియా ప్లేయర్ల జాబితాలో చోటు సంపాదించుకుంటాడు. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో సమానంగా మూడో స్థానంలో నిలుస్తాడు. అదే సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అధిగమిస్తాడు.
తిలక్ వర్మ (Tilak Varma)ఇప్పటి వరకు 30 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 53.44 సగటుతో 149.14 స్ట్రైక్‌రేటుతో 962 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 27 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలు ఉన్నారు.
Jasprit Bumrah : ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. జస్‌ప్రీత్ బుమ్రాను ఊరిస్తున్న అరుదైన రికార్డు..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 27 ఇన్నింగ్స్‌ల్లో
* కేఎల్ రాహుల్ – 29 ఇన్నింగ్స్‌ల్లో
* సూర్యకుమార్ యాదవ్ – 31 ఇన్నింగ్స్‌ల్లో
* రోహిత్ శర్మ – 40 ఇన్నింగ్స్‌ల్లో
