Jasprit Bumrah : ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. జస్‌ప్రీత్ బుమ్రాను ఊరిస్తున్న అరుదైన రికార్డు..
ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను అరుదైన రికార్డు ఊరిస్తోంది.
Bumrah need three more wickets to break all time T20I record against Australia
Jasprit Bumrah : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 29 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు కాన్‌బెర్రా ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీస్తే.. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా చరిత్ర సృష్టిస్తాడు.
ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ పేరిట ఉంది. అతడు 11 టీ20 మ్యాచ్ల్లో 14.26 సగటుతో 19 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం బుమ్రా 17 వికెట్లతో ఉన్నాడు. బుమ్రాతో పాటు పాక్‌కు చెందిన మహ్మద్ అమీర్, న్యూజిలాండ్‌కు చెందిన మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి లు ఆసీస్ పై టీ20ల్లో 17 వికెట్లు తీశారు.
ఆసీస్ పై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* సయీద్ అజ్మల్ (పాకిస్తాన్) – 19 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా (భారత్) – 17 వికెట్లు
* మహ్మద్ అమీర్ (పాకిస్తాన్) – 17 వికెట్లు
* మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్) – 17 వికెట్లు
* ఇష్ సోదీ (న్యూజిలాండ్) -17 వికెట్లు
భారత స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ తొమ్మిది టీ20 మ్యాచ్ల్లో 13.86 సగటుతో 15 వికెట్లు సాధించాడు.
ఆసీస్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. బుమ్రా పని భారం విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.
