BAN vs WI : భారీ సిక్స్ కొట్టిన బంగ్లాదేశ్ బ్యాటర్.. ఔట్ ఇచ్చిన అంపైర్.. మామూలు ట్విస్ట్ కాదండోయ్..
బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో (BAN vs WI) ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
BAN vs WI 1st t20 Taskin Ahmed Smashes Huge Six But Given Out By Umpire Huge Twist
BAN vs WI : మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 16 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో (BAN vs WI) వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ షై హోప్ (46 నాటౌట్; 28 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (44 నాటౌట్; 28 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), అలిక్ అథనాజ్ (34; 27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), బ్రాండన్ కింగ్ (33; 36 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) లు రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. రిషద్ హుస్సేన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 166 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తంజిమ్ హసన్ సాకిబ్ (33), తోహిద్ హ్రిడోయ్ (28) లు రాణించారు. మిగిలిన వారు విఫలం కావడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ , జేసన్ హోల్డర్ చెరో మూడు వికెట్లు తీశారు. అకేల్ హోసిన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖరీ పియర్, రొమారియో షెపర్డ్ లు చెరో వికెట్ సాధించారు.
తస్కిన్ అహ్మద్ భారీ సిక్స్.. కానీ..
లక్ష్య ఛేదనలో 19 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 146/9గా ఉంది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 20 పరుగులు అవసరం. క్రీజులో బౌలర్లు తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ లు ఉన్నారు. ఈ ఓవర్‌ను విండీస్ బౌలర్ రొమారియో షెపర్డ్ వేశాడు. తొలి మూడు బంతులకు మూడు పరుగులు వచ్చాయి.
When you think you’ve won but life pulls an UNO reverse ◀️#BANvWI pic.twitter.com/neEUjd6bcZ
— FanCode (@FanCode) October 27, 2025
Suryakumar Yadav : శ్రేయస్ అయ్యర్ గాయంపై సూర్యకుమార్ యాదవ్ కీలక అప్‌డేట్..
దీంతో బంగ్లాదేశ్ గెలవాలంటే ఆఖరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టాల్సి ఉంది. ఈ క్రమంలో రొమారియో షెపర్డ్ నాలుగో బంతి వేయగా.. తస్కిన్ అహ్మద్ భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో బంగ్లా అభిమానులు సంతోషంలో నిండిపోయారు. అయితే.. అంపైర్ మాత్రం తస్కిన్ ఔట్ అని చెప్పాడు. ఇందుకు కారణంగా.. తస్కిన్ సిక్స్ కొట్టే క్రమంలో అతడి కాలు వికెట్లను తాకి బెయిల్స్ పడ్డాయి. దీంతో తస్కిన్ ను హిట్ వికెట్‌గా అంపైర్ ఔట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
