Suryakumar Yadav : శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయంపై సూర్య‌కుమార్ యాద‌వ్ కీల‌క అప్‌డేట్..

శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయంపై సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) అప్‌డేట్ ఇచ్చాడు.

Suryakumar Yadav : శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయంపై సూర్య‌కుమార్ యాద‌వ్ కీల‌క అప్‌డేట్..

India T20I captain Suryakumar Yadav Gives Update On Shreyas Medical Situation

Updated On : October 28, 2025 / 12:28 PM IST

Suryakumar Yadav : సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్ర‌మంలో టీమ్ఇండియా వ‌న్డే వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అత‌డు సిడ్నీలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అత‌డి ఆరోగ్య ప‌రిస్థితి పై టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ కీల‌క అప్‌డేట్ ఇచ్చారు.

బుధ‌వారం (అక్టోబ‌ర్ 29) భార‌త్‌, ఆసీస్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు కాన్ బెర్రా ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో సూర్య మాట్లాడాడు.

IND vs SA : భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన ద‌క్షిణాఫ్రికా.. 15 మంది స‌భ్యులు గ‌ల బృందంలో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..?

శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయ‌ప‌డ్డాడ‌ని తెలిసిన వెంట‌నే తాను అత‌డికి ఫోన్ చేసిన‌ట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే.. ఆ స‌మ‌యంలో అత‌డి వ‌ద్ద ఫోన్ లేద‌న్నాడు. దీంతో వెంట‌నే తాను ఫిజియో కమలేష్ జైన్‌కు ఫోన్ చేసిన‌ట్లుగా తెలిపాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని అత‌డు చెప్పాడ‌ని తెలిపాడు.

ఇక రెండు రోజులుగా తాను శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు. అయ్య‌ర్ కూడా త‌న‌కు రిప్లై ఇస్తున్నాడ‌ని, దీన్ని బ‌ట్టి అత‌డి ఆరోగ్యం స్థిరంగా ఉంద‌ని అర్థం చేసుకోవచ్చున‌ని అన్నాడు. ఇంకొన్ని రోజులు అత‌డు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండ‌నున్నాడ‌ని తెలిపాడు. అత‌డు అంద‌రితో మాట్లాడుతున్నాడు కాబ‌ట్టి ఇదొక మంచి ప‌రిణామం అని తెలిపాడు.

Pratika Rawal ruled out : భార‌త్‌కు భారీ షాక్.. ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకున్న ప్ర‌తీకా రావ‌ల్‌

హర్షిత్ రాణా బౌలింగ్‌లో అలెక్స్ కారీ షాట్ ఆడాడు. మిస్ టైమింగ్ కావ‌డంతో బంతి గాల్లోకి లేచింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ వెన‌క్కి ప‌రిగెడుతూ డైవ్ చేస్తూ చ‌క్క‌ని క్యాచ్ అందుకున్నాడు. అయితే.. ఈ క్ర‌మంలో అత‌డి ఎడ‌మ వైపు ప‌క్క‌టెముక‌లు నేల‌ను బ‌లంగా తాకింది. దీంతో అత‌డి ప‌క్క‌టెముక‌కు గాయమైంది. తీవ్ర‌మైన నొప్పితో బాధ‌ప‌డ్డాడు. ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ వెంట‌నే శ్రేయ‌స్ ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత‌డికి నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల్లో అత‌డి ప్లీహానికి గాయ‌మైన‌ట్లు తేలింది. దీంతో పాటు అంత‌ర్గ‌త ర‌క్త‌స్రావం అవుతున్న‌ట్లు గుర్తించారు. ప్ర‌స్తుతం అత‌డు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడు.