SRH : షమీ నుంచి ఇషాన్ వరకు.. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఎస్ఆర్‌హెచ్ ట్రేడింగ్‌లో వదులుకునే ఆటగాళ్లు వీరేనా?
ఐపీఎల్ వేలం 2026కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ట్రేడింగ్‌లో ఓ ముగ్గరు ఆటగాళ్లు వదులుకునే అవకాశం ఉంది.
Three players SRH might trade before IPL 2026 Auction
SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడగా ఆరు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ రద్దు కాగా.. 13 పాయింట్లతో ఆరో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో టైటిలే లక్ష్యంగా జట్టులో పలు మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ (SRH) బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంది. అయితే.. వారి బౌలింగ్ విభాగం మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఓ ముగ్గురు ఆటగాళ్లను ట్రేడింగ్ విండో ద్వారా విడుదల చేసి కొత్త ఆటగాళ్లను తీసుకుని జట్టుకు సమతూకం తీసుకురావాలని సన్‌రైజర్స్ చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Suryakumar Yadav : శ్రేయస్ అయ్యర్ గాయంపై సూర్యకుమార్ యాదవ్ కీలక అప్‌డేట్..
మహ్మద్ షమీ..

ఐపీఎల్ 2025 మెగావేలంలో మహ్మద్ షమీని సన్‌రైజర్స్ రూ.10 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. అతడి అనుభవం, పేస్ జట్టుకు ఉపయోగపడుతుందని భావించింది. అయితే.. ఆశించిన స్థాయిలో షమీ రాణించలేదు. ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. అతడి ఎకానమీ కూడా ఎక్కువగా ఉంది. ఆరంభంలోగానీ, డెత్ ఓవర్లలోగానీ అతడు ప్రభావం చూపలేకపోయాడు. అతడు వయసు, ఫిట్‌నెస్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అతడిని ట్రేడింగ్ ద్వారా విడుదల చేయొచ్చు.
రాహుల్ చాహర్..

ట్రేడింగ్‌లో వదులుకోవాలనుకునే మరో ఆటగాడు లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ కావొచ్చు. మెగావేలంలో ఇతడిని రూ.3.20 కోట్లకు తీసుకుంది. అయితే.. సీజన్ మొత్తంలో అతడిని ఒకే ఒక మ్యాచ్ ఆడించింది. ఆ మ్యాచ్‌లో అతడు విఫలం అయ్యాడు. ఈ సీజన్‌లో జట్టు యాజమాన్యం యువ స్పిన్నర్ హర్ష్ దూబేను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడింది. అదే సమయంలో విదేశీ ఆటగాళ్లలో స్పిన్ ఆల్‌రౌండర్లకు తుది జట్టులో ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో చాహర్‌ను ట్రేడింగ్ ద్వారా వదులుకుని నాణ్యమైన దేశీయ స్పిన్నర్‌ను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇషాన్ కిషన్..

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.11.25 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ సీజన్‌ను అద్భుతంగా ఆరంభించాడు. తొలి మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగాడు. అయితే.. ఆ తరువాత ఘోరంగా విపలం అయ్యాడు. మొత్తంగా 13 ఇన్నింగ్స్‌ల్లో 354 పరుగులు చేశాడు. నిలకడ లేకపోవడం, మ్యాచ్ పరిస్థితులను బట్టి అతడి స్థానాన్ని మార్చే వీలులేకపోవడం కూడా ఎస్ఆర్‌హెచ్ మిడిల్ ఆర్డర్ స్థిరత్వాన్ని దెబ్బతీసింది. ఈ క్రమంలో అతడిని ట్రేడింగ్ ద్వారా విడుదల చేసి మిడిల్ ఆర్డర్‌లో రాణించే వికెట్ కీపర్ బ్యాటర్ కోసం చూడొచ్చు.
