Gautam Gambhir : సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ పై గంభీర్ కామెంట్స్.. 30 బంతుల్లో 40 పరుగులు చేయొచ్చు.. కానీ..
సూర్యకుమార్ యాదవ్ పేలవ టీ20 ఫామ్ పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) స్పందించాడు.
Gautam Gambhir breaks silence on Suryakumar Yadav horrible T20I form
Gautam Gambhir : టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది 11 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య 11.11 సగటుతో 100 పరుగులు మాత్రమే చేశాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్‌లో అతడి సారథ్యంలో భారత్ విజయం సాధించినప్పటికి కూడా ఈ టోర్నీలో బ్యాటర్‌గా సూర్య విఫలం అయ్యాడు. 7*, 47*, 0, 5, 12, 1 పరుగులు చేయడంతో ప్రస్తుతం అతడిపై విమర్శల జడివాన కురుస్తోంది. మునపటిలా ధాటిగా ఆడలేకపోతున్నాడని ఈ నేపథ్యంలో జట్టుకు భారంగా మారుతున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
బుధవారం నుంచి ఆస్ట్రేలియాతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. కాన్‌బెర్రా తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూర్య కుమార్ యాదవ్ ఫామ్ పై టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఆసీస్‌తో సిరీస్‌లో అతడు తప్పకుండా రాణిస్తాడనే ధీమాను వ్యక్తం చేశాడు.
Jasprit Bumrah : ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. జస్‌ప్రీత్ బుమ్రాను ఊరిస్తున్న అరుదైన రికార్డు..
వాస్తవం చెప్పాలంటే సూర్య ఫామ్ పై తనకు ఎలాంటి ఆందోళన లేదని తెలిపాడు. ఎందుకంటే టీ20ల్లో దూకుడైన బ్యాటింగ్ తీరును కొనసాగించాలని జట్టుగా తాము నిర్ణయం తీసుకున్నామన్నాడు. ఈ క్రమంలోనే సూర్య ధాటిగా ఆడేందుకు ప్రయత్నించి విఫలం అవుతున్నాడని చెప్పుకొచ్చాడు.
నిదానంగా ఆడుతూ.. 30 బంతుల్లో 40 పరుగులు చేయడం సూర్యకు పెద్ద కష్టం కాదని, అలా చేసి అతడు విమర్శల నుంచి తప్పుకోవచ్చునని తెలిపాడు. అయినప్పటికి సూర్య అలా చేయడన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన కన్నా జట్టు విజయానికే తాము ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చాడు.
ఇక ఆసియాకప్ 2025లో అభిషేక్ శర్మ చాలా బాగా ఆడాడని తెలిపాడు. అతడు ఇదే జోరును ఆసీస్‌తో సిరీస్‌లోనూ కొనసాగించాలని తాము కోరుకుంటున్నామని గంభీర్ అన్నాడు. సూర్య ఫామ్ అందుకుంటే అతడు తప్పకుండా బాధ్యతను తీసుకుంటాడని తెలిపాడు. ఈ జట్టు సూర్యది అని, కోచ్‌గా నా బాధ్యత ఏంటంటే.. ఆటను గమనించి అతడికి సరైన సలహాలు ఇవ్వడమే అని గంభీర్ తెలిపాడు.
