WTC Finals 2023 IND vs AUS
WTC Finals 2023 Prize Money: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ ముగియగానే మరో సమరం క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. అదే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్(WTC Final). ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా భారత్(India), ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే కొందరు భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతగా నిలిస్తే ఎంత ప్రైజ్ మనీ వస్తుంది. రన్నరప్‌కు ఎంతిస్తారు అన్న విషయాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) నేడు(మే 26 శుక్రవారం) తెలియజేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గెలిచిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. అంటే భారత కరెన్సీలో రూ.13.24 కోట్లు అన్నమాట. అదే విధంగా రన్నరప్‌కు 8 లక్షల డాలర్లు (రూ.6.5 కోట్లు) బహుమతిగా అందనుంది.
WTC final: ఆస్ట్రేలియా కొత్త జెర్సీని చూశారా..? టీమ్ఇండియాతో మ్యాచ్ కోసమేనట
Prize pot for the ICC World Test Championship 2021-23 cycle revealed ?
Details ?https://t.co/ZWN8jrF6LP
— ICC (@ICC) May 26, 2023
20019-21 ఎడిషన్‌కు కూడా ఇంతే ప్రైజ్‌మనీ అందించారు. ఎటువంటి మార్పులు చేయలేదు. ఇక మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు 450,000 డాలర్లు(రూ. 3.6 కోట్లు), నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌కు రూ. 2.8 కోట్లు, ఐదో స్థానంలో ఉన్న శ్రీలంకకు రూ.1.6 కోట్లు దక్కనున్నాయి. ఇక ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు తలో 100,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.82లక్షలు అందనున్నాయి.
తొలి డబ్ల్యూటీసీ ఎడిషన్ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన భారత్ ఈ సారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. అందుకనే ఇప్పటికే ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ చేరుకోని జట్లలోని భారత ఆటగాళ్లు లండన్‌కు వెళ్లారు. రన్ మిషన్ విరాట్ కోహ్లీ, నయా వాల్ పుజారా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్, శార్దూల్ ఠాకూర్ తదితర ఆటగాళ్లు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, కేఎస్ భరత్, మహ్మద్ షమీ లు ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే లండన్ విమానం ఎక్కనున్నారు.