Pro Kabaddi League to welcome back fans as new season begins on October 7
Pro Kabaddi League: క్రీడా అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు ప్రొ కబడ్డీ లీగ్ మళ్లీ వచ్చేసింది. దేశంలో ఐపీఎల్ తర్వాత అంతటి రేంజ్ క్రేజ్ ప్రో కబడ్డికి సొంతం. మన దేశ గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ ఈ లీగ్ ద్వారా గ్లోబల్ లెవల్లో సత్తా చాటింది. కబడ్డి ప్లేయర్స్ కూడా వేలు, లక్షలు దాటి కోట్లు అందుకున్నారంటే అది ప్రో కబడ్డి లీగ్ ఘనతే. ఈ కబడ్డీ లీగ్ ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకుంది. 9వ సీజన్‌కు సర్వం సిద్దమవుతోంది. ‘‘కబడ్డీ.. కబడ్డీ..’’ అంటూ అక్టోబర్ 7న తొలి కూత వినిపించనుంది. దీనికి సంబంధించిన వేలం ప్రక్రియ ఆగస్టు 5, 6వ తేదీల్లో ముగిసింది.
బెంగళూరు, పూణె, హైదరాబాద్ కేంద్రంగా ఈ లీగ్ కొనసాగనుంది. డిసెంబర్ వరకు కొనసాగే ఈ లీగ్‌కు పెద్ద ఎత్తున క్రీడాభిమానులు హాజరవుతారని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కొవిడ్ కారణంగా 8వ లీగ్‌ను అభిమానులు లేకుండానే కొనసాగించారు. తాజాగా నిర్వహించే లీగ్‌లో అన్ని జాగ్రత్తల నడుమ క్రీడాభిమానుల ప్రత్యక్ష కోలాహాలం నడుమే నిర్వహించనున్నట్లు ఈ లీగ్ సీఈవో అనుపమ్ గోస్వామి తెలిపారు.
Pizza Delivery Boy: చిరిగిన నోటు తీసుకోలేదని పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. పరిస్థితి విషమం