Pro Panja League 2023
Pro Panja League 2023 – Arm Wrestling: న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్ కొనసాగుతోంది. శుక్రవారం ఈ లీగ్ ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ప్రారంభించారు. ఈ లీగ్ నిర్వాహకులు ప్రితీ జింఘానియా, పర్వీన్ దబాస్ సహా ప్రాంఛైజీ యజమానులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.
Pro Panja League 2023
శుక్రవారం జరిగిన పోటీలో తెలుగు జట్టు కిరాక్ హైదరాబాద్.. లూథియాన లయన్స్‌తో పోరులో 3-14 తేడాతో ఓడిపోయింది. ఆదివారం బరోడా బాద్‌షాస్ టీమ్ తో కిరాక్ హైదరాబాద్ పోటీపడనుంది. అండర్ కార్డ్ మ్యాచుల్లో మూడు ఓటములు ఎదుర్కొన్న కిరాక్ హైదరాబాద్.. మెయిన్ కార్డ్ మ్యాచుల్లో ఓ మ్యాచ్ మాత్రం గెలిచి ఊపిరి పీల్చుకుంది.
Pro Panja League 2023
అండర్ కార్డ్ మ్యాచుల్లో 70 కిలోల విభాగంలో షాహిల్ షా 1-2తో శివాన్షు కౌశి చేతిలో ఓడిపోయాడు. 80 కేజీల విభాగంలో కాజి 0-1తో రాహుల్ కుమార్ కు పాయింట్ కోల్పోయాడు. అలాగే, 100 ప్లస్ కేజీల విభాగంలో లూథియానా లయన్స్ అఫ్జల్ ఖాన్ 1-0తో వినాయక్ పై గెలిచాడు.
మెయిన్ కార్డ్ మ్యాచుల్లో అక్సర్ అలీ బాగా ఆడాడు. 80 కేజీల విభాగంలో 3-1తో తేజాస్‌పై గెలుపొంది కిరాక్ హైదరాబాద్ సీజన్ లో బోణీ కొట్టాడు. 70 కిలోల విభాగంలో స్టీవ్ థామస్ 0-5తో శివాజిత్ చేతిలో ఓడిపోయాడు. అలాగే, 60 కిలోల విభాగంలో షోయబ్ అక్తర్ కూడా 0-5తో సచిన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
Pro Panja League 2023
మొత్తం ఆరు మ్యాచుల్లో (మూడు అండర్ కార్డ్, మూడు మెయిన్ కార్డ్) ఒక్క మ్యాచులోనే గెలుపొందింది కిరాక్ హైదరాబాద్. మొత్తం ఆరు జట్లు ఈ లీగ్ లో తలపడుతున్నాయి. ఫైనల్స్ ఆగస్టు 13న జరుగుతాయి.