Yusuf Pathan Video: సిక్సులు, ఫోర్ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకుల మతిపోగొట్టిన యూసఫ్ పఠాన్.. 26 బాల్స్ 80 రన్స్

ఆ ఓవర్లో వరుసగా 6, 6, 0, 6, 2, 4 పరుగులు చేశారు మన పఠాన్. మొత్తం 26 బంతుల్లో పఠాన్ 80 పరుగులు చేసి తన జట్టును గెలిపించారు.

Yusuf Pathan Video: సిక్సులు, ఫోర్ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకుల మతిపోగొట్టిన యూసఫ్ పఠాన్.. 26 బాల్స్ 80 రన్స్

Yusuf Pathan (@ZimCricketv)

Yusuf Pathan Video Zim Afro T10 – 2023: టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ మళ్లీ మైదానంలో మెరుపులు మెరిపించారు. సిక్సులు, ఫోర్లు బాదుతూ ప్రేక్షకులను అలరించారు. జింబాబ్వే క్రికెట్ (Zimbabwe Cricket) నిర్వహిస్తోన్న జిమ్ ఆఫ్రో టీ10 – 2023 (Zim Afro T10 – 2023)లో జోబర్గ్ బఫెలోస్ (Joburg Buffaloes) జట్టు తరఫున యూసఫ్ పఠాన్ ఆడుతున్నారు.

శుక్రవారం జోబర్గ్ బఫెలోస్, డర్బన్ క్వాలండర్స్ (Durban Qalandars) మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరిగింది. డర్బన్ క్వాలండర్స్ బౌలర్, పాకిస్థాన్ మాజీ పేసర్ (Pakistani bowler) మొహమ్మద్ అమీర్ (Mohammad Amir) వేసిన 8వ ఓవర్లో యూసఫ్ పఠాన్ మూడు సిక్సులు బాదారు.

ఆ ఓవర్లో వరుసగా 6, 6, 0, 6, 2, 4 పరుగులు చేశారు. మొత్తం 26 బంతుల్లో పఠాన్ 80 పరుగులు చేసి తన జట్టును గెలిపించారు. జోబర్గ్ బఫెలోస్ జట్టులో పఠాన్ తర్వాత కెప్టెన్ మొహ్మద్ హఫీజ్ చేసిన 17 పరుగులకే అత్యధిక స్కోరు. మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ క్వాలండర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 140 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన జోబర్గ్ బఫెలోస్ బ్యాటర్లలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు అతి తక్కువ పరుగులకే వెనుదిరిగారు. నాలుగో స్థానంలో దిగిన యూసఫ్ పఠాన్ 80 పరుగులతో అజేయంగా నిలవడంతో 9.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి జోబర్గ్ బఫెలోస్ 142 పరుగులు చేసింది.

దీంతో 6 వికెట్ల తేడాతో గెలిచింది. యూసఫ్ పఠాన్ అద్భుత రీతిలో బ్యాటింగ్ ఆడిన తీరు.. ఆయన టీమిండియా తరఫున ఫాంలో ఉన్నప్పుడు ఆడిన రోజులను గుర్తు చేసింది. జింబాబ్వేలోని హరారేలో జిమ్ ఆఫ్రో టీ10 – 2023 మ్యాచులు జరుగుతున్నాయి.

IND vs WI ODI Match: తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ జెర్సీ ఎందుకు ధరించాడో తెలుసా? సంజు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్.. ..