Pro Panja League 2023 : ప్రొ పంజా లీగ్‌లో దూసుకెళ్తున్న కిరాక్ హైద‌రాబాద్‌.. ఆరో విజ‌యం

ప్రొ పంజా లీగ్‌ (ఆర్మ్‌ రెజ్లింగ్‌) తొలి సీజన్‌లో కిరాక్‌ హైదరాబాద్ (Kiraak Hyderabad) అద‌ర‌గొడుతోంది. ఆరో విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Pro Panja League 2023

Pro Panja League 2023 – Arm Wrestling : ప్రొ పంజా లీగ్‌ (ఆర్మ్‌ రెజ్లింగ్‌) తొలి సీజన్‌లో కిరాక్‌ హైదరాబాద్ (Kiraak Hyderabad) అద‌ర‌గొడుతోంది. ఆరో విజ‌యాన్ని న‌మోదు చేసింది. బుధవారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో రోహతక్‌ రౌడీస్‌(Rohtak Rowdies)తో జరిగిన మ్యాచ్‌లో కిరాక్‌ హైదరాబాద్‌ 21-12తో గెలుపొందింది. స్టార్‌ ఆర్మ్‌ రెజ్లర్‌ మధుర కెఎన్‌ అజేయ రికార్డు కొనసాగించింది. కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన మధుర.. హైదరాబాద్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. గత మూడు మ్యాచుల్లో మధుర ఏకంగా ఆరు గేముల్లో గెలుపొంద‌టం విశేషం.

Eden Gardens: ప్రపంచ కప్‌కోసం సిద్ధమవుతున్న ఈడెన్ గార్డెన్స్‌ మైదానంలో అగ్నిప్రమాదం.. ఎలా జరిగిందంటే?

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది మ్యాచులు ఆడిన కిరాక్ హైద‌రాబాద్ ఆరు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానాన్ని మ‌రింత ప‌టిష్టం చేసుకుంది. త‌ద్వారా సెమీఫైన‌ల్స్‌కు మ‌రింత చేరువైది. రోహతక్‌ రౌడీస్‌పై విజయం అందించిన కిరాక్‌ హైదరాబాద్‌ ఆర్మ్‌ రెజ్లర్లను ప్రాంఛైజీ యజమాని నెదురుమల్లి గౌతం రెడ్డి, సీఈవో త్రినాథ్‌ రెడ్డి అభినందించారు.

అండర్‌ కార్డ్‌లో వెనుకంజ..

రోహతక్‌ రౌడీస్‌తో మ్యాచ్‌లో కిరాక్‌ హైదరాబాద్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లో మహిళా ఆర్మ్‌ రెజ్లర్‌ మధుర కెఎన్‌ మినహా ఎవరూ రాణించ‌లేదు. 65 కేజీల విభాగంలో రోషిని 0-1తో నిరాశపరచగా.. స్పెషల్‌ మ్యాచ్‌లో దేవేంద్ర యాదవ్‌ సైతం 0-1తో తేలిపోయాడు. కానీ మధుర కెఎన్‌ 1-0తో నజుమున్నీష కెపిపై కండ బలం చాటింది. మధుర విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ అండర్‌ కార్డ్‌లో కిరాక్‌ హైదరాబాద్‌ 1-2తో వెనుకంజలో నిలిచింది.

Pro Panja League 2023

మధుర మెరుపుల్‌..

మెయిన్‌ కార్డ్‌లో కిరాక్‌ హైదరాబాద్‌ సత్తా చాటింది. తొలుత పురుషుల 80 కేజీల విభాగంలో ధీరజ్‌ సింగ్‌ 10-0తో ఏకపక్ష విజయం నమోదు చేశాడు. పది సార్లు రోహతక్‌ రౌడీస్‌ ఆర్మ్‌ రెజ్లర్‌ ఆర్యన్‌ కెను పడగొట్టాడు. మెన్స్‌ 100 ప్లస్‌ కేజీల విభాగంలో ఉజ్జ్వల్‌ అగర్వాల్‌ అంచనాలను అందుకోలేదు. రోహతక్‌ రౌడీస్‌కు సంజయ్‌ దేశ్వాల్‌ 10-0తో విజయాన్ని అందించాడు. దీంతో కిరాక్‌ హైదరాబాద్‌ 11-12తో ఓ పాయింట్‌ వెనుకంజలో నిలిచింది. ఇక్కడే నిర్ణయాత్మక మ్యాచ్‌లో మధుర కెఎన్‌ అదరగొట్టింది. రిబాసక్‌పై 5-0తో మెరుపు విజయం నమోదు చేసింది. మధుర కెఎన్‌ డబుల్‌ ధమాకాతో కిరాక్‌ హైదరాబాద్‌ సీజన్లో ఆరో విజ‌యాన్ని సొంతం చేసుకుని సెమీఫైనల్స్‌కు ద‌గ్గ‌రైంది.

Asia Cup 2023 Match Timings : ఆసియాక‌ప్‌లో మ్యాచులు ఎన్ని గంట‌ల‌కు మొద‌లవుతాయంటే..? పూర్తి షెడ్యూల్ ఇదే..

Pro Panja League 2023