ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచులో పంజాబ్ గెలుపొందింది. దీంతో పంజాబ్ జట్టు ఫైనల్స్‌కు చేరింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో మొదట ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
ఆ జట్టు బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 44, తిలక్ వర్మ 44, బెయిర్ స్టో 38 పరుగులు, నమన్ దీర్ 37 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఒమర్ 2, జేమిసన్, స్టోయినిస్, విజయ్ కుమార్, చాహల్ తలో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 87 (నాటౌట్)తో చెలరేగడంతో ఆ జట్టు 19 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి విజయాన్ని సాధించింది.
పంజాబ్ కింగ్స్ మిగతా బ్యాటర్లలో ప్రియాంశ్ 20, ప్రభ్‌సిమ్రన్ 6, ఇంగ్లిస్ 38, వధేరా 48, శశాంక్ 2, స్టాయినిస్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ 2, బౌల్ట్, హార్దిక్ ఒక్కో వికెట్ తీశారు.