IPL 2020, KXIP vs KKR Live: 2పరుగుల తేడాతో కోల్‌కత్తా విజయం

  • Publish Date - October 10, 2020 / 03:13 PM IST

[svt-event title=”రెండు పరుగుల తేడాతో పంజాబ్‌పై కోల్‌కతా ఘన విజయం” date=”10/10/2020,7:24PM” class=”svt-cd-green” ] ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గెలుపు చివరకు కోల్‌కత్తా వశం అయ్యింది. రెండు పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. [/svt-event]

[svt-event title=”ఓటమికి చేరువగా కోల్‌కత్తా.. పంజాబ్ స్కోరు 136/1(16.0)” date=”10/10/2020,6:57PM” class=”svt-cd-green” ] కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 165పరుగుల టార్గెట్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ జట్టు అధ్భుతంగా ఆడుతుంది. 16ఓవర్లు ముగిసేసరికి జట్టు ఒక్క వికెట్ నష్టానికి 136పరుగులు చేసింది. ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేయగా.. మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు. విజయం కోసం పంజాబ్.. ఇక 24బంతుల్లో 29పరుగులు మాత్రమే చెయ్యవలసి ఉంది. ప్రస్తుతం స్కోరు 136/1 [/svt-event]

[svt-event title=”ఫస్ట్ వికెట్‌గా మయాంక్.. పంజాబ్ స్కోరు 117/1(15.0)” date=”10/10/2020,6:48PM” class=”svt-cd-green” ] ఫస్ట్ వికెట్‌గా మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు. ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో 39బంతుల్లో 56పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో 115పరుగుల ఫస్ట్ వికెట్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ప్రస్తుతం నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్లు.. పంజాబ్ స్కోరు 105/0″ date=”10/10/2020,6:37PM” class=”svt-cd-green” ] కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 165పరుగుల టార్గెట్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంబించిన పంజాబ్ జట్టు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ఈ క్రమంలోనే ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మయాంక్ అగర్వాల్ 33బంతుల్లో 50పరుగులు చెయ్యగా.. కేఎల్ రాహుల్ 44బంతుల్లో 54పరుగులు చేశాడు. [/svt-event]

[svt-event title=”పంజాబ్ స్కోరు 76/0(10)” date=”10/10/2020,6:23PM” class=”svt-cd-green” ] 165పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 76పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 25బంతుల్లో 34పరుగులు చెయ్యగా.. కేఎల్ రాహుల్ 37బంతుల్లో 42పరుగులు చేశాడు. [/svt-event]

[svt-event title=”పవర్ ప్లే పూర్తయ్యాక పంజాబ్ స్కోరు 47/0″ date=”10/10/2020,6:05PM” class=”svt-cd-green” ] 165పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ జట్లు పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 47పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 16బంతుల్లో 21పరుగులు చెయ్యగా.. కేఎల్ రాహుల్ 20బంతుల్లో 26పరుగులు చేశాడు. [/svt-event]

[svt-event title=”పంజాబ్ టార్గెట్ 165″ date=”10/10/2020,5:24PM” class=”svt-cd-green” ] కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) vs కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరుగుతున్న IPL 2020 24 వ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించిన కోల్‌కతా నైట్ రైడర్స్.. నిర్ణీత 20ఓవర్లలో 164పరుగుల స్కోరు చేసింది. [/svt-event]

[svt-event title=”కెప్టెన్ ఇన్నింగ్స్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కార్తీక్” date=”10/10/2020,5:00PM” class=”svt-cd-green” ] పంజాబ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ పంజాబ్ బౌలర్లపై దూకుడుగా ఆడుతున్నాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు సాయంతో 22బంతుల్లో 52పరుగులు చేసి ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న దినేష్ కార్తీక్. [/svt-event][svt-event title=”పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతున్న కార్తీక్.. కోల్‌కతా స్కోరు 133/3(17)” date=”10/10/2020,4:56PM” class=”svt-cd-green” ] పంజాబ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ పంజాబ్ బౌలర్లపై దూకుడుగా ఆడుతున్నాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు సాయంతో 19బంతుల్లో 43పరుగులు చేశాడు దినేష్ కార్తీక్. 17ఓవర్లకు కోల్‌కతా స్కోరు 133/3 [/svt-event]

[svt-event title=”15ఓవర్లకు కోల్‌కతా స్కోరు 101/3″ date=”10/10/2020,4:44PM” class=”svt-cd-green” ] పంజాబ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మూడు వికెట్లు నష్టపోగా.. 15ఓవర్లకు కోల్‌కతా స్కోరు 101పరుగులుగా ఉంది. ప్రస్తుతం క్రీజులో సుబ్మాన్ గిల్ 53(44), దినేష్ కార్తీక్ 16(10) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”మూడవ వికెట్‌గా మోర్గాన్.. కోల్‌కతా స్కోరు 75/3(13)” date=”10/10/2020,4:32PM” class=”svt-cd-green” ] రెండు వికెట్లు తర్వాత కష్టాల్లో పడిపోయిన కోల్‌కత్తా జట్టుకు స్కోరును పరుగులు పెట్టించే ప్రయత్నంలో మోర్గాన్ అవుట్ అయ్యాడు. 23బంతుల్లో 24పరుగులు చేసిన మోర్గాన్ బిష్ణోయ్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 13ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 3వికెట్లు నష్టానికి 75పరుగులుగా ఉంది. [/svt-event]

[svt-event title=”రాణిస్తున్న మోర్గాన్.. నిలకడగా గిల్..కోల్‌కతా స్కోరు 60/2(10.0)” date=”10/10/2020,4:23PM” class=”svt-cd-green” ] రెండు వికెట్లు తర్వాత కష్టాల్లో పడిపోయిన కోల్‌కత్తా జట్టుకు స్కోరు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు మోర్గాన్.. గిల్.. ఈ క్రమంలో దూకుడుగా మోర్గాన్ రాణిస్తుండగా.. గిల్ నిలకడగా పరుగులు తీస్తున్నాడు. కోల్‌కతా స్కోరు 2వికెట్లు నష్టానికి 60పరుగులుగా ఉంది. [/svt-event]

[svt-event title=”కష్టాల్లో కోల్‌కతా.. స్కోరు 49/2(9.0)” date=”10/10/2020,4:17PM” class=”svt-cd-green” ] పంజాబ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రెండు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. రాహుల్ త్రిపాఠి మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అవగా.. నితీష్ రానా రనౌట్‌గా పెవిలియన చేరడంతో మోర్గాన్, గిల్ ఇన్నింగ్స్ నడిపిస్తున్నారు. ప్రస్తుతం 9ఓవర్లకు కోల్‌కతా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 49పరుగులుగా ఉంది. [/svt-event]

[svt-event title=”పవర్ ప్లే లోనే రెండు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా.. ఆరు ఓవర్లకు స్కోరు 25/2″ date=”10/10/2020,4:05PM” class=”svt-cd-green” ] పంజాబ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు నష్టానికి 25పరుగులు మాత్రమే చేసింది. రాహుల్ త్రిపాఠి మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అవగా.. నితీష్ రానా రనౌట్‌గా పెవిలియన చేరాడు. [/svt-event]

[svt-event title=”Playing XI’s:” date=”10/10/2020,3:17PM” class=”svt-cd-green” ] Kolkata Knight Riders: రాహుల్ త్రిపాఠి, షుబ్మాన్ గిల్, నితీష్ రానా, సునీల్ నరైన్, ఎయోన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్ (w/k), పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్‌కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి [/svt-event]

[svt-event title=”Playing XI’s:” date=”10/10/2020,3:16PM” class=”svt-cd-green” ] Kings XI Punjab: KL రాహుల్ (C), మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, సిమ్రాన్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ [/svt-event]

[svt-event title=”Playing XI:” date=”10/10/2020,3:10PM” class=”svt-cd-green” ]

[svt-event title=”టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌” date=”10/10/2020,3:05PM” class=”svt-cd-green” ] ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్‌లో శనివారం(10 అక్టోబర్ 2020) రెండు మ్యాచ్‌లు జరగనుండగా.. తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించింది. [/svt-event]