Quinton de Kock creates history Most ODI 100s against an opponent by designated wicketkeepers
Quinton de Kock : దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. విశాఖ వేదికగా భారత్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా అతడు ఈ ఘనత అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో క్వింటన్ డికాక్.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 80 బంతుల్లో మూడు అంకెల స్కోరును అందుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. వన్డేల్లో భారత్ పై డికాక్‌కు ఇది ఏడో సెంచరీ.
Virat Kohli : ‘కోహ్లీ మామ.. నేను నీకు కాబోయే కోడలిని..’ ఫ్లకార్డుతో చిన్నారి.. వీడియో వైరల్
వన్డేల్లో ఓ ప్రత్యర్థి పై అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్లు వీరే..
* క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) – భారత్ పై 7 శతకాలు
* ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – శ్రీలంక పై 6 శతకాలు
* కుమార సంగక్కర (శ్రీలంక) – భారత్ పై 6 శతకాలు
* కుమార సంగక్కర (శ్రీలంక) – బంగ్లాదేశ్ పై 5 శతకాలు
* క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) – శ్రీలంక పై 4 శతకాలు
* కుమార సంగక్కర (శ్రీలంక) – ఇంగ్లాండ్ పై 4 శతకాలు
భారత్ పై అత్యధిక సెంచరీలు..
తాజాగా శతకంతో భారత్ పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్యతో కలిసి క్వింటన్ డికాక్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. వీరిద్దరు వన్డేల్లో భారత్ పై చెరో ఏడు సెంచరీలు సాధించారు.
వన్డేల్లో భారత్ పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
* క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) – 23 ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు
* సనత్ జయసూర్య (శ్రీలంక) – 85 ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు
* ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) – 32 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 59 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు
* కుమార్ సంగక్కర (శ్రీలంక) – 71 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు
ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 89 బంతులు ఎదుర్కొన్న డికాక్ 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేసి ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.