Quinton de Kock: వరల్డ్ కప్ లో వరుసగా రెండో సెంచరీ కొట్టిన డికాక్.. డివిలియర్స్ తర్వాత అతడే

దక్షిణాఫ్రికా ఓపెనర్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మంచి ఊపు మీద ఉన్నాడు. ప్రపంచకప్ లో వరుసగా రెండో సెంచరీ బాదేశాడు.

Quinton de Kock: వరల్డ్ కప్ లో వరుసగా రెండో సెంచరీ కొట్టిన డికాక్.. డివిలియర్స్ తర్వాత అతడే

quinton de kock second consecutive hundreds in odi world cup

Updated On : October 12, 2023 / 5:43 PM IST

Quinton de Kock hundreds in World Cup: వన్డే ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ వరుసగా రెండో సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియాతో లక్నోలో గురువారం జరుగుతున్న మ్యాచ్ లో అతడు సెంచరీ సాధించాడు. ఆసీస్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొని 90 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు. 106 బంతుల్లో 109 పరుగులు చేసి అవుటయ్యాడు. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జ‌రిగిన మ్యాచ్‌లోనూ అతడు శతకం బాదాడు.

దక్షిణాఫ్రికా తరపున ప్రపంచకప్ లో రెండు సెంచరీలు కొట్టిన రెండో వికెట్ కీపర్ గా క్వింటన్ డికాక్ నిలిచాడు. అతడి కంటే ముందు డివిలియర్స్ ఈ ఘనత సాధించాడు. ఓపెనర్ గా అత్యధిక వన్డే సెంచరీలు చేసిన జాబితాలోనూ డికాక్(19) సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అతడి కంటే ముందు హషిమ్ ఆమ్లా(27) పేరిట ఈ రికార్డు ఉంది. హెర్షెల్ గిబ్స్ (18), గ్యారీ కిరస్టన్(13), గ్రేమ్ స్మిత్(10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెర్షెల్ గిబ్స్ తో కలిసి డికాక్ రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ ఆసీస్ పై మూడేసి సెంచరీలు కొట్టారు. ఫాఫ్ డూప్లెసిస్ 5 సెంచరీలతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ప్రపంచకప్ లో ఎక్కువ సెంచరీలు కొట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లలో డివిలియర్స్(4) ముందున్నాడు. హెర్షెల్ గిబ్స్, హషిమ్ ఆమ్లా, డూప్లెసిస్ రెండేసి సెంచరీలు చేశారు. తాజాగా డికాక్ వీరి సరసన చేరాడు. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై గతంలో సెంచరీలు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు హెర్షెల్ గిబ్స్(101), డూప్లెసిస్(100) సరసన డికాక్ (109) నిలిచాడు.

Also Read: గిల్ వచ్చేశాడు..! అహ్మదాబాద్ కు చేరుకున్న యువ ప్లేయర్.. పాక్‌తో మ్యాచ్‌కు బరిలోకి?