R Praggnanandhaa : ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్రాకు చెస్ గ్రాండ్ మాస్ట‌ర్ ధ‌న్య‌వాదాలు

చెస్‌ సంచలనం, యువ గ్రాండ్ మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రాకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు.

R Praggnanandhaa : ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్రాకు చెస్ గ్రాండ్ మాస్ట‌ర్ ధ‌న్య‌వాదాలు

R Praggnanandhaa thanks Anand Mahindra after receiving a brand new electric car

Updated On : March 12, 2024 / 4:13 PM IST

R Praggnanandhaa – Anand Mahindra : చెస్‌ సంచలనం, యువ గ్రాండ్ మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రాకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. త‌న త‌ల్లిదండ్రుల‌కు ఎలక్ట్రిక్ కారును బ‌హుమతిగా ఇచ్చినందుకు మంగ‌ళ‌వారం ప్ర‌జ్ఞానంద త‌న సోష‌ల్ మీడియాలో ఆనంద్ మ‌హీంద్రాకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ పోస్ట్ చేశాడు.

“XUV 400 అందున్నాము. మా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా ధన్యవాదాలు ఆనంద్ మహీంద్రా సార్” అని ప్ర‌జ్ఞానంద తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. కారుతో క‌లిసి దిగిన ఫోటోల‌ను షేర్ చేశాడు.

Rinku Singh : చిన్న పిల్లాడికి సారీ చెప్పిన రింకూసింగ్‌.. ఏం జ‌రిగిందో తెలుసా..?

టాటా స్టీల్ మాస్ట‌ర్స్ టోర్న‌మెంట్ నాలుగో రౌండ్‌లో ప్ర‌పంచ ఛాంపియ‌న్ డింగ్ లిరెన్ (చైనా) జ‌న‌వ‌రి 16న ఓడించిన ప్ర‌జ్ఞానంద భార‌త టాప్ ర్యాంక‌ర్‌గా అవ‌త‌రించాడు.

ఇటీవ‌ల అత‌డికి శుభాకాంక్ష‌లు చెప్పిన ఆనంద్ మ‌హీంద్ర‌.. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల ఆస‌క్తి గ‌మ‌నించి చెస్ లో ప్రోత్స‌హించేందుకు గాను వారికి ఓ ఎల‌క్ట్రిక్ కారును బ‌హుమతిగా ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు.

‘ఇది EVల మాదిరిగానే మన గ్రహం కోసం మంచి భవిష్యత్తు కోసం పెట్టుబడి. కాబట్టి వారి కొడుకు అభిరుచిని మరింత పెంచినందుకు మా కృతజ్ఞతలకు అర్హమైన ప్రజ్ఞానానంద త‌ల్లిదండ్రులైన‌ నాగలక్ష్మి, రమేష్‌బాబు XUV4OO EVని బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నాను’ అని మహీంద్రా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌జ్ఞానంద త‌ల్లిదండ్రులు ఎస్‌యూవీ 400 కారును అందుకున్నారు.

Also Read: శుభ‌వార్త‌.. ఐపీఎల్ 2024 ఆడేందుకు రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకట‌న‌