Atlanta Open 2022 League: ఇరగకొట్టుడు కొట్టిండు.. 77 బంతుల్లో 205 పరుగులు చేసిన రహ్కీమ్ కార్న్‌వాల్.. అందులో ఎన్ని సిక్స్‌లంటే.?

టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ టెస్ట్ స్పెషలిస్ట్ రహ్కీమ్ కార్న్‌వాల్ డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అట్లాంటా ఓపెన్ 2022 లీగ్‌లో కేవలం 77 బంతుల్లో 205 పరుగులు చేశాడు. ఇందులో 22 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి.

Atlanta Open 2022 League: టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ టెస్ట్ స్పెషలిస్ట్ రహ్కీమ్ కార్న్‌వాల్ డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. అట్లాంటా ఓపెన్ 2022 లీగ్‌లో కేవలం 77 బంతుల్లో 205 పరుగులు చేశాడు. ఇందులో 22 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి. 266.23 స్ట్రైక్ రేట్‌తో రహ్కీమ్ కార్న్‌వాల్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటంతో జట్టు స్కోరు 326కి చేరుకుంది. అనంతరం బ్యాటింగ్చేసిన స్క్వేర్ డ్రైవ్ జట్టు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Team India’s T20 World Cup Squad: భారత ‘టీ20 ప్రపంచ కప్’ జట్టు ఫొటోలు వైరల్

అట్లాంటా ఓపెన్ -2022 ఓపెన్ లో భాగంగా అట్లాంటా ఫైర్ జట్టు, స్వ్కైర్ డ్రైవ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన అట్లాంటా ఫైర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ బ్యాటర్ రహ్కీమ్ కార్న్‌వాల్ మూడవ ఓవర్ నుంచి ప్రత్యర్తి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జట్టు 53 పరుగుల వద్ద స్టీవెన్ టేలర్‌ అవుట్ అయ్యాడు. కార్న్‌వాల్ సమీ అస్లామ్‌తో భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కార్న్‌వాల్ కేవలం 77 బంతుల్లో 205 పరుగులు చేశాడు. అస్లాం కూడా 29 బంతుల్లో 53 పరుగులు చేశాడు. రహ్కీమ్ మాత్రం తన అసాధారణ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.

Bharath Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న తల్లి సోనియా షూ లేస్‌లు కట్టిన రాహుల్ గాంధీ.. పాదయాత్రలో మరెన్నో అద్భుత దృశ్యాలు.. మీరూ చూడండి..

భారీ స్కోరును ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన స్క్వేర్ డ్రైవ్ జట్టు నిర్ణీత 20 ఓవర్ల వ్యవధిలో 154/8 మాత్రమే చేయగలిగింది. జస్టిన్ డిల్ నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. యశ్వంత్ బాలాజీ 38(22)తో తన జట్టుకు అత్యధిక పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును కాల్‌వార్న్ అందుకున్నాడు.

టీ20 క్రికెట్‌లో ఒక బ్యాటర్ డబుల్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి కాదు. ఢిల్లీకి చెందిన సుబోధ్ భాటి క్లబ్ టీ20 గేమ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అతను 79 బంతుల్లో 17 సిక్సర్లు, ఫోర్లతో 205 పరుగులు చేశాడు. అలాగే, 2013లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తరఫున గేల్ 175 పరుగులు చేశాడు. 2018 ముక్కోణపు సిరీస్‌లో జింబాబ్వేపై అరోన్ ఫించ్ 172 పరుగులు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు