IPL Final : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తాడా..? ఆదివారం చెన్నైలో వాతావరణం ఎలా ఉంటుందంటే..?
ఐపీఎల్ 17వ సీజన్ చివరికి వచ్చేసింది.

Rain To Play Spoilsport In IPL Final Weather Report Ahead Of KKR vs SRH
ఐపీఎల్ 17వ సీజన్ చివరికి వచ్చేసింది. ఆదివారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగియనుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలవడంతో పాటు క్వాలిఫయర్ 1లో విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుండగా.. క్వాలిఫయర్ 1లో ఓడి క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ పై గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనుంది.
ఈ క్రమంలో మ్యాచ్‌కు వరుణుడు ఆటంకంగా మారుతాడా? అన్న ఆందోళనలు నెలకొన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మే 26న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌లో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ప్రస్తుతానికి చెన్నై లేదా తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో దీని ప్రభావం ఉండదని చెప్పింది.
అక్యూవెదర్ ప్రకారం.. చెన్నైలో శనివారం వాతావరణం మేఘావృతమై ఉంటుంది. వర్షం పడేందుకు 10 శాతం అవకాశం ఉంది. ఇక ఆదివారం ప్రకాశవంతంగా ఉంటుందని, ఉరుములతో వర్షం పడే అవకాశం నాలుగు శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఈ లెక్కన చూసుకుంటే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి దాదాపుగా లేనట్లే.
ఒకవేళ ఆదివారం వర్షం పడినప్పటికీ ఏమీ కాదు. ఎందుకంటే రిజర్వు డే అందుబాటులో ఉంది. ఆదివారం వర్షం పడితే సోమవారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఆదివారం ఎక్కడనైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్‌ను నిర్వహించేందుకు అవకాశం లేకుంటే మాత్రం కోల్‌కతా విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే గ్రూపు స్టేజీలో హైదరాబాద్ కంటే కోల్‌కతానే ఎక్కువ మ్యాచుల్లో గెలిచింది.
SRH : ఆస్ట్రేలియా కెప్టెన్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అయితే.. ఐపీఎల్ ట్రోఫీ సన్‌రైజర్స్‌దే..