RCB vs RR IPL Match LIVE: రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం

  • Publish Date - October 3, 2020 / 03:18 PM IST

[svt-event title=”రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం” date=”03/10/2020,7:27PM” class=”svt-cd-green” ] రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) మధ్య అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఐపిఎల్ 2020 15వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ రాజస్థాన్ రాయల్స్‌పై 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్.. కోహ్లీ, పాడికల్ రాణించడంతో 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. [/svt-event]

[svt-event title=”ఫస్ట్ వికెట్‌గా ఫించ్ అవుట్.. ” date=”03/10/2020,6:06PM” class=”svt-cd-green” ] 155పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ జట్టు ఫస్ట్‌లోనే వికెట్ కోల్పోయింది. ఫించ్ వికెట్‌ను గోపాల్ తీసుకున్నాడు. 7బంతుల్లో 8పరుగులు చేసి ఫించ్ అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”రాణించిన కొత్త కుర్రాడు.. బెంగళూరు టార్గెట్ 155″ date=”03/10/2020,5:32PM” class=”svt-cd-green” ] రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగగా.. ఫస్ట్‌లోనే కీలక వికెట్లు కోల్పోయి కూడా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నిర్ణీత 20ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 154పరుగులు చేసింది. కొత్త కుర్రాడు మహిపాల్ లోమ్‌రోర్ రాణించగా.. చివర్లో తివాటియా 12బంతుల్లో 24పరుగులు చెయ్యగా.. ఆర్చర్ 10బంతుల్లో 16పరుగులు చేశారు. దీంతో బెంగళూరు టార్గెట్ 155గా అయ్యింది.

[svt-event title=”ఆరు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్” date=”03/10/2020,5:08PM” class=”svt-cd-green” ] బెంగళూరు బౌలింగ్ దెబ్బకు రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. ముఖ్యంగా చాహర్ రాజస్థాన్ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తన నాలుగు ఓవర్లలో మూడు కీలకమైన వికెట్లు తీసుకున్నాడు.

[svt-event title=”13ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 85/4″ date=”03/10/2020,4:45PM” class=”svt-cd-green” ] 13ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 4వికెట్లు నష్టానికి 85పరుగులు. [/svt-event]

[svt-event title=”నాల్గవ వికెట్‌గా ఊతప్ప” date=”03/10/2020,4:33PM” class=”svt-cd-green” ] నిదానంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. కష్టాల్లో ఉన్న రాజస్థాన్‌ను గట్టెక్కిస్తున్నాడు అనుకున్న సమయంలో ఊతప్ప అవుట్ అయ్యాడు. ఛాహల్ బౌలింగ్‌లో ఉడానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. రాజస్థాన్ జట్టు 11ఓవర్లకు 73పరుగులు చేసి 4వికెట్లను కోల్పోయింది. [/svt-event]

[svt-event title=”ఆచితూచి ఆడుతూ.. 10ఓవర్లకు 70పరుగులు” date=”03/10/2020,4:31PM” class=”svt-cd-green” ] రాజస్థాన్ రాయల్స్ మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోవడంతో.. తర్వాత క్రీజులో ఉన్న ఊతప్ప, లోమ్రోర్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో స్కోరు 10ఓవర్లకు 70పరుగులకు చేరుకుంది. [/svt-event]

[svt-event title=”దూకుడుగా మొదలెట్టారు.. మూడు వికెట్లు అవుట్.. స్కోరు 31/3 ” date=”03/10/2020,3:53PM” class=”svt-cd-green” ] ముంబైపై వచ్చిన గెలుపుతో బెంగళూరు ఉత్సాహంగా కనిపిస్తోండగా.. దూకుడుగా గేమ్ మొదలు పెట్టిన రాజస్థాన్‌ ఆ దూకుడును ఎక్కువ సేపు కొనసాగించలేకపోయింది. రెండు నాలుగు ఓవర్లు ముగిసేలోపే రెండు కీలక వికెట్లను రాజస్థాన్ కోల్పోయింది. తర్వాత 5వ ఓవర్ ఫస్ట్ బంతికి శాంసన్ అవుట్ అయ్యాడు. 2బంతుల్లో 4పరుగులు చేసి శాంసన్ అవుట్ అయ్యాడు. అంతకుముందు 5బంతుల్లో 5పరుగులు చేసి కెప్టెన్ స్మిత్ తొలి వికెట్‌గా అవుట్ అవగా.. 12బంతుల్లో 22పరుగులు చేసిన తర్వాత బట్లర్ అవుట్ అయ్యాడు.

RCB vs RR IPL Match LIVE: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ యొక్క 15 వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య దుబాయ్ మైదానంలో ప్రారంభం అవుతుంది. IPL2020లో మధ్యాహ్నం 3:30కు ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. RCBకి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉండగా, మరోవైపు స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నారు. ఇరు జట్లు తమ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కొక్కటి రెండు మ్యాచ్‌లు గెలిచాయి.

ఐపిఎల్ చరిత్రలో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 21 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 21 మ్యాచ్‌ల్లో 10 మ్యాచ్‌లను రాజస్థాన్ జట్టు గెలుచుకోగా, బెంగళూరు 8 మ్యాచ్‌ల్లో గెలిచింది. గత నాలుగు మ్యాచ్‌ల విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. శ్రేయాస్ గోపాల్.. ఒక మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ మరియు మార్కస్ స్టోయినిస్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.

జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Playing): దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (సి), ఎబి డివిలియర్స్ (డబ్ల్యూ), శివం దుబే, గుర్కీరత్ సింగ్ మన్, వాషింగ్టన్ సుందర్, ఇసురు ఉదనా, నవదీప్ సైని, ఆడమ్ జాంపా, యుజ్వేంద్ర చాహల్

రాజస్థాన్ రాయల్స్ (Playing): జోస్ బట్లర్ (డబ్ల్యూ), స్టీవెన్ స్మిత్ (సి), సంజు సామ్సన్, రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, మహిపాల్ లోమ్రోర్, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కట్