Ramiz Raja IPL Remark In PSL Presentation Stumps Everyone
భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ నడుస్తోండగా అటు పాకిస్తాన్ లో పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) జరుగుతోంది. కొంత మంది క్రికెట్ అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు రెండు లీగ్‌లను అనుసరిస్తూ ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ఉన్నట్లు అర్థమవుతోంది. అతడు పీఎస్ఎల్‌లో అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా పొరబాటు పడ్డాడు. పీఎస్ఎల్ అవార్డు అనకుండా ఐపీఎల్ అవార్డు అని అన్నాడు.
మంగళవారం ముల్తాన్ సుల్తాన్స్, లాహోర్ ఖలందర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ 33 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మ్యాచ్ అనంతరం అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందిస్తూ రమీజ్ రాజా పొరపాటున టోర్నమెంట్‌ను PSL అని కాకుండా HBL IPL అంటూ పిలిచాడు.
Virat Kohli : కోహ్లీకి ఓ రూల్.. మిగిలిన వాళ్లకి ఇంకో రూలా?
HBL IPL 😂😂😂😂pic.twitter.com/iMiBD3iadz
— ٰImran Siddique (@imransiddique89) April 22, 2025
ఈ అవార్డును అందుకునేందుకు జాషువా లిటల్‌ను పిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు విని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. పాక్ అభిమానుల్లో కొందరు రమీజ్ చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ సైతం చేస్తున్నారు.
కాగా.. ఐపీఎల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన కొద్దిమంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లలో రాజా ఒకరు.
ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. యాసిర్ ఖాన్ (87; 44 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో లాహోర్ ఖలందర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకే పరిమితమైంది. సికిందర్ రజా 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.