Virat Kohli : కోహ్లీకి ఓ రూల్.. మిగిలిన వాళ్లకి ఇంకో రూలా?
జరిమానాలు విధించే విషయంలో బీసీసీఐ ఆటగాళ్ల పట్ల పక్షపాత వైఖరికి అవలంభిస్తోందని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఆరోపించాడు.

No fine for Virat Kohli exposes BCCI double standard in Digvesh Rathi comparison
ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లు అతిగా సంబరాలు చేసుకున్నా, కావాలనే రెచ్చగొట్టేలా ప్రవర్తించినా గానీ బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవడాన్ని చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేష్ రాఠి నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నందుకు గాను అతడికి రెండు సార్లు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే.. బీసీసీఐ జరిమానాలు విధించే విషయంలో కూడా ఆటగాళ్ల పట్ల పక్షపాత వైఖరికి అవలంభిస్తోందని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఆరోపించాడు.
ఇందుకు విరాట్ కోహ్లీ ఘటనను ఉదాహరణగా చెబుతున్నాడు. ఆదివారం (ఏప్రిల్ 20న) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. మ్యాచ్‌లో గెలిచిన తరువాత కోహ్లీ కాస్త గట్టిగానే సంబురాలు చేసుకున్నాడు. ఆర్‌సీబీ విజయం తరువాత శ్రేయస్ వైపు చూస్తూ.. అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
BCCI : ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం.. SRH vs MI మ్యాచ్‌లో మార్పులు..!
దీనిపై తన యూట్యూబ్ ఛానల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీకి బీసీసీఐ ఎందుకు జరిమానా విధించలేదో తనకు అర్థం కాలేదన్నాడు. ‘నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నందుకు దిగ్వేష్ రతికి తొలిసారి జరిమానా విధించారు. రెండో సారి అతడు అలాగే చేయడంతో మళ్లీ ఫైన్ వేశారు. మరోసారి జరిమానా పడితే తనకు వచ్చే మొత్తం తగ్గిపోతుందని భావించి అతడు భయపడ్డాడు. ఈ క్రమంలో అతడు నేలపై రాయడం ప్రారంభించాడు.’ అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
‘పంజాబ్ పై విజయం తరువాత విరాట్ కోహ్లీ వేడుకను మనం చూశాము. అతడు చాలా దూకుడుగా కనిపించాడు. అయినప్పటికి అతడిని ఎవ్వరూ ఏమీ అనలేదు. కానీ నోటుబుక్ వేడుక చేసుకున్నప్పుడు మాత్రం రతిని తప్పుబట్టారు.’ అని ఆకాశ్ తెలిపాడు.
ఎంఎస్ ధోనికి జరిమానా..
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలోకి ప్రవేశించి అంపైర్లతో వాదించినందుకు జరిమానా విధించిన విషయాన్ని కూడా ఆకాశ్ చోప్రా గుర్తు చేసుకున్నాడు. ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ధోని మ్యాచ్ ఫీజులో 50శాతం వసూలు చేశారు. కోహ్లీకి కూడా ఇలాగే జరుగుతుందని భావించాను. కానీ కోహ్లీ బీసీసీఐ జరిమానా నుంచి ఎలా తప్పించుకున్నాడో అర్థం కావడం లేదు అని చోప్రా తెలిపాడు.