Yashasvi Jaiswal : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో య‌శ‌స్వి జైస్వాల్ దూకుడు.. కోహ్లి ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడ‌కున్నా..

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అద‌ర‌గొట్టాడు.

Yashasvi Jaiswal – ICC Test Rankings : ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అద‌ర‌గొట్టాడు. వ‌రుస‌గా రెండు టెస్టుల్లో రెండు ద్విశ‌త‌కాలు బాది త‌న కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. ఐసీసీ టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో ఏకంగా 14 స్థానాలు ఎగ‌బాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. కాగా.. టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా నుంచి కోహ్లి మాత్ర‌మే టాప్‌-10లో కొన‌సాగుతున్నాడు. 752 రేటింగ్ పాయింట్ల‌తో ఏడో స్థానంలో ఉన్నాడు.

రాజ్‌కోట్‌లో సెంచ‌రీ చేసిన‌ రవీంద్ర జడేజా ఏడు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని 41వ స్థానం నుంచి 34వ స్థానానికి ఎగబాకాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఓ స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుని 12వ ర్యాంకును చేరాడు. కాగా.. ద‌క్షిణాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడు శ‌త‌కాలు బాదిన కేన్‌ విలియమ్సన్ 893 రేటింగ్ పాయింట్ల‌తో ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

ఐసీసీ టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌..

1. కేన్‌ విలియమ్సన్ (న్యూజిలాండ్‌) – 893 రేటింగ్ పాయింట్లు
2. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 818
3. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్‌) -780
4. బాబ‌ర్ ఆజాం (పాకిస్తాన్‌) – 768
5. జో రూట్ (ఇంగ్లాండ్‌) – 766

కోహ్లికి కొడుకు పుట్టాడ‌ని తెలిసి.. పాకిస్తాన్‌లో ఏం చేశారో తెలుసా?

రాజ్‌కోట్ మ్యాచ్‌లో 500 టెస్టు వికెట్ల మైలురాయిని సాధించిన వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ స్థానం మెరుగుప‌ర‌చుకుని బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. టీమ్ఇండియా స్టార్ పేస‌ర్ జస్‌ప్రీత్ బుమ్రా 876 రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. ర‌వీండ్ర జ‌డేజా మూడు స్థానాలు ఎగ‌బాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు.

ఐసీసీ టెస్టు బౌల‌ర్ల‌ ర్యాంకింగ్స్‌..

1. జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్‌) – 876 రేటింగ్ పాయింట్లు
2. ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 839
3. క‌గిసో ర‌బాడ (ద‌క్షిణాఫ్రికా) – 834
4. పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) – 828
5. జోష్ హేజిల్ వుడ్ (ఆస్ట్రేలియా) – 818

ట్రెండింగ్ వార్తలు