Ravichandran Ashwin picked his top four teams for the upcoming IPL season
Ravichandran Ashwin : ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసింది. ఇక క్రికెట్ ప్రేమికుల అందరి దృష్టి ఐపీఎల్ 2026 సీజన్ పైనే ఉంది. ఈ సీజన్ ప్రారంభం కావడానికి మరో మూడు నెలల సమయం ఉంది అయినప్పటికి కూడా టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లు ఏవో జోస్యం చెబుతున్నాడు. ఈ జాబితాలో అతడు తన మాజీ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్‌కు చోటు ఇవ్వలేదు.
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్, ఇక నాలుగో జట్టుగా రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెడతాయన్నాడు. ఈ జట్లలో ఒక్క ఆర్ఆర్ తప్ప మిగిలిన అన్ని జట్లు ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి.
BCCI : నాలుగో టీ20 మ్యాచ్ రద్దు.. బీసీసీఐ కీలక నిర్ణయం!
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముంబై ఇండియన్స్.. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్‌ను కొనుగోలు చేయడాన్ని అశ్విన్ ప్రశంసించాడు. ఇషాన్ కిషన్ లేకపోయినప్పటికి కూడా ముంబై.. ఐపీఎల్ 2020లో విజేతగా నిలిచిన జట్టు కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. వేలంకి ముందు, తరువాత కూడా ముంబై ఇండియన్స్ చాలా బలంగా కనిపిస్తోందన్నాడు.
ఇదిలా ఉంటే.. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్ 2026 సీజన్ జరగనున్నట్లు పేర్కొంటున్నాయి. అయితే.. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటనను విడుదల చేయాల్సి ఉంది.