Ravichandran Ashwin reveals the reason behind his sudden international retirement
Ravichandran Ashwin : టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) 2024 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
ఓవైపు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ జరుగుతుండగా హఠాత్తుగా అశ్విన్ గుడ్ బై చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు.
గబ్బా వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. కాగా.. తాను అలా సిరీస్ మధ్యలో రిటైర్‌మెంట్ ప్రకటించడానికి గల కారణాన్ని తాజాగా అశ్విన్ వెల్లడించాడు.
Shreyas Iyer : నిన్న జట్టులో చోటు, నేడు వన్డే కెప్టెన్సీ ఛాన్స్.. రెండూ మిస్సాయే..
తన యూట్యూబ్ ఛానల్‌లో టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు. తనకు అదే సరైన సమయం అని భావించినట్లుగా చెప్పుకొచ్చాడు. తన వయసు ఎక్కువైందని గ్రహించానన్నాడు.
Cameron Green : ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన కామెరూన్ గ్రీన్.. అయినా గానీ..
విదేశీ పర్యటనకు వెళ్లడం బాగుందని, అయితే.. తుది జటటులో చోటు దక్కకపోవడంతో రిజర్వ్ బెంచీకే పరిమితం కావడం నచ్చలేదన్నాడు. వాస్తవానికి తనకు 34-35 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వీడ్కోలు పలకాలని భావించినట్లుగా చెప్పుకొచ్చాడు.
భారత జట్టు తరుపున అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో బౌలింగ్‌లో 357 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్‌లో 3503 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు 14 అర్థశతకాలు ఉన్నాయి. వన్డేల్లో 156 వికెట్లు పడగొట్టాడు. 707 పరుగులు చేశాడు. టీ20 మ్యాచుల్లో 72 వికెట్లు సాధించాడు. 184 పరుగులు చేశాడు.
ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. 221 మ్యాచ్‌లు ఆడాడు. 187 వికెట్లు తీశాడు. 833 పరుగులు సాధించాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.