Ravichandran Ashwin : రిటైర్‌మెంట్‌కు ముందు.. డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో ర‌విచంద్ర‌న్ అశ్విన్ భావోద్వేగ సంభాష‌ణ‌.. వీడియో

రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డాని క‌న్నా ముందు ఐదో రోజు మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్ భావోద్వేగానికి గురైయ్యాడు.

Ashwin shares hug with Kohli during emotional conversation in Gabba dressing room

టీమ్ఇండియా స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు.

త‌న‌ గురించి తాను చెప్పుకోవడం త‌న‌కి ఇష్టం ఉండదన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఇదే త‌న చివరి రోజు అని చెప్పాడు. ఓ ఆటగాడిగా త‌న‌కు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయ‌న్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న సీనియర్‌ ఆటగాళ్లలో త‌మ‌దే చివరి గ్రూప్ అని చెప్పాడు.

Ravichandran Ashwin : బిగ్ బ్రేకింగ్.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌..

తాను ఎంతో మందికి కృతజ్ఞతలు చెప్పాలన్నాడు. 14 ఏళ్ల ప్ర‌యాణంలో త‌న‌కు మ‌ద్దతుగా నిలిచిన బీసీసీఐతో పాటు సహచర ఆటగాళ్లకు, కోచ్‌లకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. అయితే.. క్లబ్ క్రికెట్ ఆడ‌తాన‌ని అశ్విన్ చెప్పాడు.

ఇదిలా ఉంటే.. రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డాని క‌న్నా ముందు ఐదో రోజు మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్ భావోద్వేగానికి గురైయ్యాడు. త‌న వీడ్కోలు విష‌యాన్ని కోహ్లీతో పంచుకున్నాడు.

ఈ స‌మ‌యంలో అశ్విన్ భావోద్వేగానికి గురైయ్యాడు. కోహ్లీ అత‌డిని కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

IND vs AUS : ఒకే ఓవ‌ర్‌లో 35 ప‌రుగులు.. నా గురించి గూగుల్‌ను అడ‌గండి.. బుమ్రా కామెంట్స్ పై సుంద‌ర్ పిచాయ్ రియాక్ష‌న్‌..