Ravichandran Ashwin : బిగ్ బ్రేకింగ్.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌..

టీమ్ఇండియా స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర అశ్విన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

Ravichandran Ashwin : బిగ్ బ్రేకింగ్.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌..

Ravichandran Ashwin retires from international cricket

Updated On : December 18, 2024 / 11:46 AM IST

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా గ‌బ్బా వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది. కాగా.. మ్యాచ్ ముగిసిన వెంట‌నే టీమ్ఇండియా స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్నిసోష‌ల్ మీడియా వేదిక‌గా బీసీసీఐ తెలియ‌జేసింది.

‘పాండిత్యం, తాంత్రికుడు, తేజస్సు, ఆవిష్కరణలకు పర్యాయపదంగా ఉండే పేరు అశ్విన్. టీమ్ఇండియా అత్యుత్త‌మ స్పిన్న‌ర్ల‌లో ఒక‌డైన ఈ దిగ్గ‌జ స్పిన్న‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

కాగా.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో అశ్విన్ కేవ‌లం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన పింక్ బాల్ టెస్టులో ఆడాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌ల్లో 22, రెండో ఇన్నింగ్స్‌లో 7 ప‌రుగులు చేశాడు. 18 ఓవ‌ర్లు వేసి 53 ప‌రుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ ప‌డ‌గొట్టాడు.

భార‌త్ త‌రుపున అశ్విన్ 106 టెస్టులు 116 వ‌న్డేలు, 65 టీ20 మ్యాచులు ఆడాడు. 106 టెస్టుల్లో 537 వికెట్ల పాటు 3503 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన రెండో భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు. ఇక 116 వ‌న్డేల్లో 156 వికెట్లతో పాటు 707 ప‌రుగులు, 65 టీ20ల్లో 72 వికెట్లతో పాటు 184 ప‌రుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ విష‌యానికి వ‌స్తే 212 మ్యాచుల్లో 800 ప‌రుగులు చేయ‌డంతో పాటు 180 వికెట్లు తీశాడు.