IND vs AUS : ఒకే ఓవర్‌లో 35 పరుగులు.. నా గురించి గూగుల్‌ను అడగండి.. బుమ్రా కామెంట్స్ పై సుందర్ పిచాయ్ రియాక్షన్..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శన చేస్తున్నాడు.

Sundar Pichai Reply On Jasprit Bumrah Google It Comment
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శన చేస్తున్నాడు. బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇక తన బ్యాటింగ్ గురించి తెలుసుకోవాలంటే గూగుల్‌లో వెతకండి అంటూ బుమ్రా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీనిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించాడు. తాను గూగుల్ చేశానని చెప్పాడు. ఈ సందర్భంగా పేస్ గుర్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు.
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసిన తరువాత బుమ్రా విలేకరులతో మాట్లాడాడు. గబ్బాలో బ్యాటింగ్ పరిస్థితుల గురించి విలేకరి ప్రశ్నించాడు. ఇందుకు బుమ్రా ఇలా సమాధానం చెప్పాడు. మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసింది ఎవరో గూగుల్ చేసి చూడండి. అని బుమ్రా అన్నాడు.
కాగా.. టెస్టుల్లో బుమ్రా ఓకే ఓవర్‌లో 35 పరుగులు చేశాడు. 2022లో బర్మింగ్‌హమ్ టెస్టులో ఇంగ్లాండ్ పై బుమ్రా ఒకే ఓవర్‌లో 35 పరుగులు సాధించాడు. ఇదీ ప్రపంచ రికార్డు. దీన్ని ఉద్దేశిస్తూ బుమ్రా ఇలా ఫన్నీగా సమాధానం చెప్పగా వైరల్‌గా మారాయి. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దీనిపై స్పందించాడు. తాను గూగుల్ చేసినట్లు చెప్పాడు. కమిన్స్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన వారికి బ్యాటింగ్ ఎలా చేయాలో చాలా బాగా తెలుసునని అన్నాడు.
అంతేకాదండోయ్ మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ను ఫాలోఆన్ గండం నుంచి తప్పించడాన్ని ప్రస్తావించాడు. ఇటు గూగుల్ ఇండియా సైతం బుమ్రా వీడియోను పోస్ట్ చేస్తూ మేము.. జస్సీ భాయ్‌ని మాత్రమే నమ్ముతాం అంటూ రాసుకొచ్చింది.
Prithvi Shaw : పృథ్వీ షాకు మరో షాక్.. ఆవేదనతో ఇన్‌స్టా పోస్ట్.. దేవుడా నువ్వే చెప్పు..
I only believe in Jassi Bhai 💪 https://t.co/Vs0WO5FfdJ
— Google India (@GoogleIndia) December 17, 2024