IND vs AUS : గబ్బా టెస్టు.. భారత విజయలక్ష్యం 275 పరుగులు.. 54 ఓవర్లలో.. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 89/7 డిక్లేర్..
బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.

Team India target 275 runs in 54 overs in Gabba Test
బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్ ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 89/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం నిలిచింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 260 పరుగులకే ఆలౌట్ చేయడంతో ఆస్ట్రేలియాకు 185 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్లు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. అయితే.. భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.
IND vs AUS : ఆసీస్ గడ్డ పై చరిత్ర సృష్టించిన బుమ్రా.. టీమ్ఇండియా బౌలర్లలో ఒకే ఒక్కడు..
ఆసీస్ బ్యాటర్లలో పాట్ కమిన్స్ (22), అలెక్స్ కేరీ (20 నాటౌట్), ట్రావిస్ హెడ్ (17) లు రెండు అంకెల స్కోరు సాధించారు. ఉస్మాన్ ఖవాజా (8), మార్నస్ లబుషేన్ (1), మిచెల్ మార్ష్ (2), స్టీవ్ స్మిత్ (4)లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
కాగా. . ఈ మ్యాచ్‌కి ఇదే ఆఖరి రోజు. 54 ఓవర్ల ఆట మిగిలి ఉంది. ఈ ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తుందా లేదంటే డ్రా చేసుకుంటుందా. ఆసీస్ బౌలర్లు విజృంభి వికెట్లు తీస్తారా? వరుణుడు ఆటంకం కలిగిస్తాడా అన్నది చూడాల్సిందే.
Prithvi Shaw : పృథ్వీ షాకు మరో షాక్.. ఆవేదనతో ఇన్‌స్టా పోస్ట్.. దేవుడా నువ్వే చెప్పు..
Innings Break!
Australia have declared after posting 89/7 in the 2nd innings.#TeamIndia need 275 runs to win the 3rd Test
Scorecard – https://t.co/dcdiT9NAoa#AUSvIND pic.twitter.com/bBCu6G0pN5
— BCCI (@BCCI) December 18, 2024