IND vs AUS : ఆసీస్ గడ్డ పై చరిత్ర సృష్టించిన బుమ్రా.. టీమ్ఇండియా బౌలర్లలో ఒకే ఒక్కడు..
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు.

Bumrah Breaks Kapil Record To Become India Most Successful Test Bowler In Australia
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ల్లో మార్నస్ లబుషేన్‌ను ఔట్ చేయడం ద్వారా అతడు ఈ ఘనత అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియాలో బుమ్రా పడగొట్టిన వికెట్ల సంఖ్య 52కి చేరింది.
ఈ క్రమంలో కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు. 51 వికెట్లతో ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్ల రికార్డు గతంలో కపిల్ దేవ్ పేరిట ఉండేది. తాజాగా బుమ్రా దీన్ని బద్దలు కొట్టాడు. కాగా.. కపిల్ 11 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా బుమ్రా 10 టెస్టుల్లోనే అతడిని అధిగమించడం విశేషం. వీరిద్దరి తరువాత అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్‌లు ఉన్నారు.
Prithvi Shaw : పృథ్వీ షాకు మరో షాక్.. ఆవేదనతో ఇన్‌స్టా పోస్ట్.. దేవుడా నువ్వే చెప్పు..
ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..
జస్‌ప్రీత్ బుమ్రా – 52* వికెట్లు
కపిల్ దేవ్ – 51 వికెట్లు
అనిల్ కుంబ్లే – 49 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ – 40 వికెట్లు
బిషన్ సింగ్ బేడీ – 35 వికెట్లు
ఇక ఆస్ట్రేలియాలో భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లియోన్ ఉన్నాడు. అతడు 18 టెస్టుల్లో 63 వికెట్లు సాధించాడు.
AUS vs IND: ట్రావిస్ హెడ్‌కు సారీ చెప్పిన ఆకాశ్ దీప్.. ఫన్నీ వీడియో వైరల్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 445 పరుగులు చేసింది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు కీలకమైన 185 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం భారత బౌలర్లు అదరగొడుతుండడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 11 ఓవర్లలో 33 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Most Test wickets by an Indian in Australia:
Jasprit Bumrah – 52*.
Kapil Dev – 51.THE GOAT IS DOMINATING…!!! 🐐🇮🇳 pic.twitter.com/T0EWvYkHHv
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 18, 2024