Ravindra jadeja : చ‌రిత్ర సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా.. ఇంగ్లాండ్ గ‌డ్డ పై ఒకే ఒక భార‌త ఆల్‌రౌండ‌ర్‌..

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Ravindra jadeja becomes only second player in 145 years to achieve massive feat

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా అరుదైన ఘ‌న‌త సాధించాడు. మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 11 ప‌రుగుల వ‌ద్ద అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ గ‌డ్డ పై టెస్టుల్లో వెయ్యికి పైగా ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ గ‌డ్డ పై 1000కిపైగా ప‌రుగులు, 30కి పైగా వికెట్లు తీసిన తొలి భార‌త ఆల్‌రౌండ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు.

వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు గ్యారీ ఫీల్డ్ సోబ‌ర్స్ త‌రువాత ఇంగ్లాండ్‌లో 30కి పైగా వికెట్లతో పాటు వెయ్యికి పైగా ప‌రుగులు చేసిన రెండో ఆల్‌రౌండ‌ర్‌గా జ‌డేజా నిలిచాడు. ఇక ఓవ‌రాల్‌గా తీసుకుంటే.. విదేశీ గ‌డ్డ పై ఈ ఘ‌న‌త సాధించిన మూడో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

Rishabh Pant : ఐదో టెస్టుకు దూర‌మైన రిష‌బ్ పంత్‌.. జ‌ట్టు కోసం కీల‌క‌ సందేశం.. అబ్బాయిలు..

టీమ్ఇండియా త‌రుపున ఇంగ్లాండ్ గ‌డ్డ పై అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో జ‌డేజా త‌రువాతి స్థానాల్లో క‌పిల్ దేవ్‌, వినూ మ‌న్క‌డ్ లు ఉన్నారు. క‌పిల్ దేవ్ 13 మ్యాచ్‌ల్లో 638 ప‌రుగులు, 43 వికెట్లు తీశాడు. వినూ మ‌న్క‌డ్ 6 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు, 395 ప‌రుగులు చేశాడు. ర‌విశాస్త్రి 9 మ్యాచ్‌ల్లో 503 ప‌రుగులు చేయ‌డంతో పాటు 11 వికెట్లు సాధించాడు.

ఇంగ్లాండ్ గడ్డ‌పై టెస్టుల్లో భారత్ తరఫున అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న చేసిన ఆల్‌రౌండ‌ర్లు వీరే..

రవీంద్ర జడేజా – 16 మ్యాచ్‌లు 1096 ప‌రుగులు, 34 వికెట్లు
కపిల్ దేవ్ – 13 మ్యాచ్‌లు 638 పరుగులు, 43 వికెట్లు
వినూ మన్కడ్ – 6 మ్యాచ్‌లు 395 పరుగులు, 20 వికెట్లు
రవిశాస్త్రి – 9 మ్యాచ్‌లు 503 పరుగులు, 11 వికెట్లు

Suryakumar Yadav : డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు.. ‘ఇది అంత సుల‌భం కాదు.. నువ్వు ఆడ‌క‌పోయినా..’ సూర్య‌కుమార్ యాద‌వ్ ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 358 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 669 ప‌రుగులు చేసింది. భార‌త్ రెండో ఇన్నింగ్స్ 4 వికెట్ల న‌ష్టానికి 425 ప‌రుగులు చేయ‌గా.. మ్యాచ్ డ్రాగా ముగిసింది.