Ravindra Jadeja eye on Gary Sobers historic Test double in England
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. లోయర్ ఆర్డర్‌లో వస్తూ జట్టుకు విలువైన పరుగులను అందిస్తూ టీమ్ మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. లార్డ్స్‌లో జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఇక ఇప్పుడు నాలుగో టెస్టులోనూ పంత్ గాయపడడంతో తొలి రోజే క్రీజులోకి అడుగుపెట్టాడు జడేజా. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
కాగా.. రెండో రోజు ఆటలో జడేజా మరో 12 పరుగులు చేస్తే ఓ అరుదైన ఘనత అతడి సొంతం అవుతుంది. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో 1000కి పైగా పరుగులు, 30 కిపైగా వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇక ఓవరాల్‌గా రెండో విదేశీ ఆటగాడిగా నిలుస్తాడు.
Womens World Cup 2025 : చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్.. మహిళల చెస్ ప్రపంచకప్ పైనల్‌కి..
ఈ జాబితాలో గ్యారీ సోబర్స్ తొలి ఆటగాడు. సోబర్స్ ఇంగ్లాండ్ గడ్డ పై 21 టెస్టుల్లో 1820 పరుగులు, 30 వికెట్లు తీశాడు. ప్రస్తుతం జడేజా 16 టెస్టుల్లో బౌలింగ్‌లో ఇప్పటికే 30 వికెట్లు తీయగా, బ్యాటింగ్‌లో 988 పరుగులు చేశాడు.
టీమ్ఇండియా తరుపున ఇంగ్లాండ్ గడ్డ పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా తరువాతి స్థానాల్లో కపిల్ దేవ్, వినూ మన్కడ్ లు ఉన్నారు. కపిల్ దేవ్ 13 మ్యాచ్‌ల్లో 638 పరుగులు, 43 వికెట్లు తీశాడు. వినూ మన్కడ్ 6 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు, 395 పరుగులు చేశాడు. రవిశాస్త్రి 9 మ్యాచ్‌ల్లో 503 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు సాధించాడు.
Rishabh Pant : రిషబ్ పంత్ స్థానంలో మరో ఆటగాడు బ్యాటింగ్ చేయొచ్చా.. నిబంధనలు ఏం చెబుతున్నాయ్?
ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆల్‌రౌండర్లు వీరే..
రవీంద్ర జడేజా – 16 మ్యాచ్‌లు 988 పరుగులు, 30 వికెట్లు
కపిల్ దేవ్ – 13 మ్యాచ్‌లు 638 పరుగులు, 43 వికెట్లు
వినూ మన్కడ్ – 6 మ్యాచ్‌లు 395 పరుగులు, 20 వికెట్లు
రవిశాస్త్రి – 9 మ్యాచ్‌లు 503 పరుగులు, 11 వికెట్లు