Womens World Cup 2025 : చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్.. మహిళల చెస్‌ ప్రపంచకప్ పైనల్‌కి..

భార‌త చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ అరుదైన ఘ‌న‌త సాధించింది.

Womens World Cup 2025 : చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్.. మహిళల చెస్‌ ప్రపంచకప్ పైనల్‌కి..

FIDE Women's World Cup final 2025 Divya Deshmukh enter into final

Updated On : July 24, 2025 / 12:52 PM IST

భార‌త చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ అరుదైన ఘ‌న‌త సాధించింది. ఫిడే మహిళల ప్రపంచకప్‌ ఫైనల్ చేరిన తొలి భార‌త క్రీడాకారిణిగా చ‌రిత్ర సృష్టించింది. సెమీఫైన‌ల్‌లో 19 ఏళ్ల దివ్య మాజీ ప్ర‌పంచ ఛాంపియ‌న్ తాన్ తాన్‌ జోంగ్యిపై 1.5-0.5 తేడాతో గెలుపొందింది. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో దివ్య 2026 మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు అర్హ‌త సాధించింది. అంతేకాదండోయ్‌.. తొలి గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌ను కూడా సాధించింది.

మంగళవారం సెమీస్‌ తొలి గేమ్‌ను న‌ల్ల‌పావుల‌తో ఆడిన దివ్య డ్రాగా ముగించింది. బుధ‌వారం రెండో గేమ్‌లో తెల్ల‌పావుల‌తో ఆడి ప్ర‌త్య‌ర్థిని మ‌ట్టి క‌రిపించింది. తాన్‌ జోంగ్యి త‌ప్పుల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని విజ‌యం సాధించింది.

Rishabh Pant : రిష‌బ్ పంత్ స్థానంలో మ‌రో ఆట‌గాడు బ్యాటింగ్ చేయొచ్చా.. నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయ్‌?

ఇదిలా ఉంటే.. మ‌రో సెమీఫైన‌ల్‌లో గ్రాండ్ మాస్ట‌ర్ కోనేరు హంపి చెనాకు చెందిన లీ టింగ్‌జీతో త‌ల‌ప‌డింది. వ‌రుస‌గా రెండు గేమ్‌లు డ్రాగా ముగిశారు. దీంతో గురువారం వీరిద్ద‌రు టైబ్రేక్స్ గేమ్స్ ఆడ‌తారు. గెలిచిన వారు ఫైన‌ల్‌కు చేరుకుంటారు.