Ravindra Jadeja joined Ian Botham Kapil Dev in elite list
Ravindra Jadeja : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 10 పరుగుల వద్ద అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాళ్లు ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, డేనియల్ వెటోరీ ఉన్న ఎలైట్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగు వేల పరుగులు చేయడంతో పాటు 300 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా జడేజా (Ravindra Jadeja ) రికార్డుల్లోకి ఎక్కాడు.
టెస్టుల్లో 4 వేల పరుగులు, 300 వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..
ఇయాన్ బోథమ్ (ఇంగ్లాండ్) – 5200 పరుగులు, 383 వికెట్లు
కపిల్ దేవ్ (భారత్)- 5248 పరుగులు, 434 వికెట్లు
డేనియల్ వెటోరి (న్యూజిలాండ్) – 4531 పరుగులు, 362 వికెట్లు
రవీంద్ర జడేజా – 4000* పరుగులు, 338 వికెట్లు
LETS SALUTE THE CV OF JADEJA IN TEST CRICKET 🫡
– Just 4th Cricketer ever to complete 4000 runs & 300 wickets in Tests, argulary one of the Greatest ever.
We are witnessing Greatness. pic.twitter.com/mmRNfmwjkc
— Johns. (@CricCrazyJohns) November 15, 2025
2012లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన రవీంద్ర జడేజా తాజా మ్యాచ్‌తో కలిపి 88 మ్యాచ్‌లు ఆడాడు.