Ravindra Jadeja : జ‌డేజాను మాయ చేసింది.. ప‌బ్లిక్‌గానే క్ర‌ష్ నుంచి ప్ర‌మోష‌న్ ఇచ్చి మ‌రీ..

మొన్న‌టి వ‌ర‌కు బిజీ క్రికెట్ ఆడి అల‌సిపోయిన జ‌డేజా వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌డంతో ప్ర‌స్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జ‌డ్డూ మూడు ఫోటోల‌ను షేర్ చేశాడు. ‘ఫరెవర్ క్రష్’ అంటూ ఆ ఫోటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చాడు.

Ravindra Jadeja

Ravindra Jadeja Crush : ఇటీవ‌ల ముగిసిన ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(Ravindra Jadeja). గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆఖ‌రి రెండు బంతుల్లో 10 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా సిక్స్‌, ఫోర్ బాది సీఎస్‌కే కు అద్వితీయ‌మైన విజ‌యాన్ని అందించాడు. కాగా.. ఆస్ట్రేలియాతో జ‌రిగిన డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్(WTC Final) మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిన‌ప్ప‌టికి జ‌డేజా మాత్రం స‌త్తా చాటాడు.

మొన్న‌టి వ‌ర‌కు బిజీ క్రికెట్ ఆడి అల‌సిపోయిన జ‌డేజా వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌డంతో ప్ర‌స్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జ‌డ్డూ మూడు ఫోటోల‌ను షేర్ చేశాడు. ‘ఫరెవర్ క్రష్’ అంటూ ఆ ఫోటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చాడు. గుర్రంతో జ‌డేజా దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోలో జ‌డేజా బ్లూ క‌ల‌ర్ ట్రాక్‌, రెడ్ టీష‌ర్డ్, స్పోర్ట్స్ షూస్‌తో క్యాప్ ధరించి ఉన్నాడు.

James Anderson : జేమ్స్ అండ‌ర్స‌న్ అరుదైన ఘ‌న‌త‌.. 1100 వికెట్ల క్ల‌బ్‌లో చేరిక‌

రాజ్‌పుత్‌ కుటుంబానికి చెందిన జడేజాకు గుర్రాలు అంటే చాలా ఇష్టం అన్న సంగ‌తి తెలిసిందే. అందుక‌నే త‌న ఫామ్ హౌస్‌లో గుర్రాల‌ను పెంచుకుంటున్నాడు. త‌నకు స‌మ‌యం దొరికిన‌ప్పుడు గుర్రాల‌పై స్వారీ చేస్తుంటాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేస్తుంటాడు. గ‌తేడాది కూడా జడేజా తన గుర్రంతో ఇలాంటి చిత్రాన్ని పంచుకున్నాడు. దానికి “మై క్రష్” అని క్యాప్షన్ ఇచ్చాడు.

Virat Kohli : విరాట్ కోహ్లి సంపాద‌న ఎంతో తెలుసా..? మ‌రే క్రికెటర్‌కు కూడా సాధ్యం కాని రీతిలో

ఇదిలా ఉంటే.. ర‌వీంద్ర జ‌డేజా ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున 65 టెస్టులు, 174 వ‌న్డేలు, 64 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 2,706 ప‌రుగులు, వ‌న్డేల్లో 2,526, టీ20ల్లో 457 ప‌రుగులు చేశాడు. బౌలింగ్ విష‌యానికి వ‌స్తే.. టెస్టుల్లో 268 వికెట్లు, వ‌న్డేల్లో 191, టీ20ల్లో 51 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 226 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్‌లో 2,692 ప‌రుగులు చేయ‌గా బౌలింగ్‌లో 152 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇటీవల కాలంలో మూడు ఫార్మాట్ల‌లో టీమ్ఇండియాకు కీల‌క ఆట‌గాడిగా మారాడు.

ట్రెండింగ్ వార్తలు