APL- 2024 : బెజవాడ టైగర్స్ పై గెలుపు.. లీగ్ ద‌శ‌ను విజ‌యంతో ముగించిన రాయ‌ల‌సీమ కింగ్స్‌

ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) - 2024లో రాయలసీమ కింగ్స్ అద‌ర‌గొడుతోంది.

Rayalaseema Kings beat Bezawada Tigers by 38 runs

ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) – 2024లో రాయలసీమ కింగ్స్ అద‌ర‌గొడుతోంది. విజ‌యంతో లీగ్ ద‌శ‌ను ముగించింది. సోమ‌వారం బెజ‌వాడ టైగ‌ర్స్ పై 38 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంతో రాయ‌ల‌సీమ కింగ్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలోకి దూసుకువెళ్లింది. మంగళవారం జరిగే పోరులో ఉత్తరాంధ్ర లయన్స్‌ ఓటమిపాలైతే..లీగ్‌ దశలో రాయలసీమ కింగ్స్‌ టాప్‌ స్థానంలో నిలుస్తుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయ‌ల‌సీమ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. హనీశ్‌రెడ్డి, ప్రశాంత్‌కుమార్‌..కింగ్స్‌ తరఫున ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. అయితే హనీశ్‌ ఏడు బంతుల్లో 5 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. మరో ఎండ్‌లో ప్రశాంత్ దుమ్ములేపాడు. 15 బంతుల్లో అర్ధసెంచరీతో కదంతొక్కాడు. మొత్తంగా 20 బంతుల్లో 60 పరుగులు సాధించాడు. రోషన్‌ కూడా దూకుడు కనబరుస్తూ 20 బంతుల్లో 16 పరుగులు చేశాడు.

IND vs ZIM : జింబాబ్వేపై విజయం తరువాత శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు

తన్నీరు వంశీకృష్ణ 22 బంతుల్లో 18 పరుగులు చేయ‌గా.. ఇన్నింగ్స్‌ ఆఖర్లో వినయ్‌కుమార్‌ 15 బంతుల్లో 27 పరుగులు, గుత్తా రోహిత్‌ 19 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలువడంతో రాయలసీమ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 171/8 స్కోరు చేసింది.

బెజవాడ టైగర్స్ బౌల‌ర్ల‌లో సాయి రాహుల్ (3/17) మూడు వికెట్లు తీశాడు. లలిత్‌ మోహన్‌(2/19), హరీశంకర్‌రెడ్డి(2/46) లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. 172 పరుగుల లక్ష్యఛేదనలో బెజవాడ ఘోరంగా తడబడింది. మహీప్‌కుమార్‌, ధృవ్‌కుమార్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. ధృవ 2 పరుగులకే ఔట్‌ కాగా, మహీప్‌ 34 బంతుల్లో 45 పరుగులు, లక్ష్మణ్‌(15), దత్తారెడ్డి(21), సాయిరాహుల్‌(16), అవినాశ్‌(17) ఫర్వాలేదనిపించారు.

Chris Gayle : 44 ఏళ్ల వ‌య‌సులోనూ క్రిస్‌గేల్ వీర‌విహారం.. ద‌క్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజ‌యం..

మిగతా బ్యాటర్లు కనీసం రెండెంకల స్కోరు అందుకోలేకపోవ‌డం 133 ప‌రుగుల‌కే బెజ‌వాడ కుప్ప‌కూలింది. రాయలసీమ కింగ్స్ బౌల‌ర్ల‌లో షేక్‌ కమ్రుద్దీన్‌(4/13) నాలుగు వికెట్లు తీశాడు. వినయ్‌కుమార్‌(2/24), అంజనేయులు(2/34) చెరో రెండు వికెట్లు, సత్యరాజు, రఫీ ఒక్కొ వికెట్ సాధించారు.