IND vs ZIM : జింబాబ్వేపై విజయం తరువాత శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు
జింబాబ్వే చేతిలో మొదటి టీ20లో ఓడిపోయిన టీమిండియా రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై విజయం తరువాత శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Shubman Gill
Shubman Gill : జింబాబ్వే చేతిలో మొదటి టీ20లో ఓడిపోయిన టీమిండియా రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడడంతో జింజాబ్వే ముందు భారత్ 235 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శుభ్‌మన్ గిల్ 2, అభిషేక్ శర్మ 100, రుతురాజ్ గైక్వాడ్ 77, రింకూ సింగ్ 48 పరుగులు చేశారు. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో జింబాబ్వే బ్యాటర్లు చేతులెత్తేశారు. 18.4 ఓవర్లకు 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది.
Also Read : ధోనీ పుట్టినరోజు వేడుకల్లో భార్య సాక్షి ఏం చేసిందో చూశారా.. వీడియో వైరల్
జింబాబ్వేపై విజయం తరువాత శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ లో విజయం సాధించడం ఆనందంగా ఉంది. అభిషేక్, రుతురాజ్ లు బ్యాటింగ్ చేసిన విధానం ముఖ్యంగా పవర్ ప్లేలో అంత సులభం కాదు. బంతి టర్న్ అవుతుంది. కానీ, అభిషేక్, రుతురాజ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. ఇది ఒక యువ జట్టు. ఇందులో ఎక్కువ మంది అంతర్జాతీయ క్రికెట్ కు కొత్తవారు ఉన్నారని గిల్ అన్నారు.
Also Read : Rohit Sharma : ఏంటయ్యా రోహిత్.. సూర్యకుమార్‌ను జట్టు నుంచి తప్పించేస్తావా..?
మొదటి మ్యాచ్ లో ఓటమి గురించి గిల్ మాట్లాడారు. మొదటి మ్యాచ్ లో ఒత్తిడికి గురయ్యాం. అదికూడా మంచిదే అయింది. రెండో మ్యాచ్ పై ఎక్కువ దృష్టిపెట్టడానికి వీలుపడింది. ఈ సిరీస్ లో ఇంకా మూడు మ్యాచ్ లు ఉన్నాయి. మేము వాటికోసం ఎదురు చూస్తున్నామని గిల్ అన్నాడు. ఇదిలాఉంటే.. టీమిండియా కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ కు ఇదే తొలి విజయం కావటం గమనార్హం.
The first win for captain Shubman Gill in the blue jersey. ?? pic.twitter.com/CZHA1JMLCb
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2024