Kris Srikkanth : ఆర్‌సీబీ గెల‌వాలంటే.. 11 మంది బ్యాట‌ర్ల‌తో బ‌రిలోకి.. కోహ్లి బౌలింగ్

మాజీ ఆట‌గాడు క్రిష్ణ‌మాచారి శ్రీశాంత్ మండిప‌డ్డాడు. ప్ర‌స్తుత ఆర్‌సీబీ బౌల‌ర్ల కంటే విరాట్ కోహ్లీ మంచిగా బౌలింగ్ చేయ‌గ‌ల‌డ‌ని అన్నాడు.

Kris Srikkanth – Virat Kohli : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఆశించిన స్థాయిలో రాణించ‌డం లేదు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచులు ఆడిన బెంగ‌ళూరు ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. మిగిలిన ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో కొన‌సాగుతోంది. బ్యాటింగ్‌లో ఒక‌రిద్ద‌రూ రాణిస్తున్న‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు బౌల‌ర్లు దారుణంగా విఫ‌లం అవుతున్నారు.

సోమ‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బెంగ‌ళూరు బౌల‌ర్లు పోటీ ప‌డి మ‌రీ దారాళంగా ప‌రుగులు ఇచ్చారు. దీంతో ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ప‌రుగులు చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 287/3 స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న పై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు క్రిష్ణ‌మాచారి శ్రీశాంత్ మండిప‌డ్డాడు. ప్ర‌స్తుత ఆర్‌సీబీ బౌల‌ర్ల కంటే విరాట్ కోహ్లీ మంచిగా బౌలింగ్ చేయ‌గ‌ల‌డ‌ని అన్నాడు.

రీస్ టోప్లీ బౌలింగ్‌ను బాదేశారు. లాకీ ఫెర్గూస‌న్ బౌలింగ్‌ను చిత‌క్కొట్టారు. వీరిద్ద‌రూ ఈ సీజ‌న్‌లో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా లాకీ కోల్‌క‌తా నుంచి ఆర్‌సీబీకి వ‌చ్చినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌న్నాడు. ఉన్న‌వారిలో విల్ జాక్స్ ఒక్క‌డే కాస్త న‌య‌మ‌న్నాడు.

RCB vs SRH : స‌న్‌రైజ‌ర్స్‌తో బెంగ‌ళూరు మ్యాచ్‌.. బెంచీపై రూ.47 కోట్లు..

ఇక బెంగ‌ళూరు జ‌ట్టు 11 మంది బ్యాట‌ర్ల‌తో ఆడితే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్నాడు. కెప్టెన్ డుప్లెసిస్ రెండు ఓవ‌రు, కామెరూన్ గ్రీన్ 4 ఓవ‌ర్లు వేయాలి. అలాగే వీరితో పాటు కోహ్లి సైతం నాలుగు ఓవ‌ర్లు వేయాలి. రెగ్యుల‌ర్ బౌల‌ర్ల‌తో పోలిస్తే విరాట్ త‌క్కువ ప‌రుగులు ఇస్తాడ‌ని భావిస్తున్న‌ట్లు శ్రీకాంత్ అన్నాడు.

విరాట్ ను చూస్తే బాధేసింది..

చిన్న‌స్వామి వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లిని చూస్తే త‌న‌కు బాధేసింద‌ని శ్రీకాంత్ చెప్పాడు. హైద‌రాబాద్ బ్యాట‌ర్లు దంచికొడుతుంటే బాల్స్ అన్ని స్టాండ్స్ వైపు వెలుతుంటే వాటిని కోహ్లి నిరాసక్తిగా చూస్తుండిపోయాడ‌న్నాడు. బ్యాటింగ్ చేయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు కోహ్లి కోపంతో ఉన్న‌ట్లు క‌నిపించాడని శ్రీకాంత్ తెలిపాడు.

ప్లే ఆఫ్స్ ఆశ‌లు సంక్లిష్టం..

ఏడు మ్యాచుల్లో ఆరు మ్యాచులు ఓడిపోవ‌డంతో బెంగ‌ళూరు జ‌ట్టు ప్లే ఆఫ్స్ ఆశ‌లు సంక్లిష్టం అయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఆర్‌సీబీ నిల‌వాలంటే ఇప్ప‌టి నుంచి ఆడే ప్ర‌తి మ్యాచుల్లోనే గెల‌వాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచులో ఓడిపోయినా ఇంటి బాట ప‌ట్టాల్సి ఉంటుంది. ఓ వైపు జ‌ట్టు ఓడిపోతున్న‌ప్ప‌టికీ కోహ్లి రాణిస్తున్నాడు. ఏడు మ్యాచుల్లో 361 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం ఆరెంజ్ క్యాప్ అత‌డి వ‌ద్దే ఉంది.

Shah Rukh Khan : ‘గౌత‌మ్ గంభీర్ మీరు బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు..’ : షారుఖ్ ఖాన్‌

ట్రెండింగ్ వార్తలు